`బిగ్‌ బాస్`కి కమల్‌ హాసన్‌ గుడ్‌ బై.. కొత్త హోస్ట్ అతడేనా? నిజమైతే రచ్చ రచ్చే

First Published | Aug 6, 2024, 8:09 PM IST

బిగ్‌ బాస్‌ తమిళ షోకి లోకనాయకుడు కమల్‌ హాసన్‌ హోస్ట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన తప్పుకున్నారు. ఆయన స్థానంలో వచ్చే హోస్ట్ అతడేనా?
 

kamal haasan step down as host of bigg boss tamil season 8 new host is that star hero? arj

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ ఇటీవల `భారతీయుడు 2`తో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. శంకర దర్శకత్వం వహించిన ఈ సినిమా గత నెలలో విడుదలైంది. కానీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. రొటీన్‌ స్టోరీతో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది. అయితే అంతకు ముందే `కల్కి 2898 ఏడీ` సినిమాతో అలరించారు కమల్‌. కనిపించింది ఐదు నిమిషాలేఅయినా గూస బంమ్స్ తెప్పించారు. ఆ హైప్‌లో ఉన్న ఆడియెన్స్ కి `భారతీయుడు 2` పెద్ద షాక్‌ ఇచ్చింది. 

kamal haasan step down as host of bigg boss tamil season 8 new host is that star hero? arj

ఈ నేపథ్యంలో ఇప్పుడు కమల్‌ బిగ్‌ బాస్‌ కి షాక్‌ ఇచ్చాడు. ఈ షో నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. గత ఏడు సీజన్లకి ఆయన హోస్ట్ గా చేస్తున్నారు. షో విజయవంతంగా రన్‌ కావడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. ఈ షో రక్తికట్టడంలో కమల్‌ పాత్రచాలా ఉంది. చాలా విషయాలను ఆయన షేర్‌ చేసుకునే విధానం ఆసక్తికరంగా అనిపించేది. అందుకే ఈ షో సక్సెస్‌ అయ్యింది. 


కానీ తాజాగా ఆయన ఈ సీజన్‌ కి హోస్ట్ గా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు కమల్. తన బిజీ షెడ్యూల్‌ కారణంగా హోస్ట్ గా కొనసాగలేకపోతున్నానని ప్రకటించారు. ఈ మేరకు ఓ ఎమోషనల్‌ నోట్‌ని ఆయన షేర్‌ చేసుకున్నారు. `ఏడేళ్ల క్రితం మొదలైన ఈ ప్రయాణంలో చిన్న విరామం. సినిమా కమిట్‌మెంట్స్‌ వల్ల రాబోయే `బిగ్‌బాస్‌ సీజన్‌`కి హోస్టింగ్‌ చేయట్లేదు. ఈ విషయాన్ని చాలా బాధతో చెబుతున్నా. ఈ షో ద్వారా ఇంటింటికీ చేరువైనందుకు నాకెంతో గర్వంగా ఉంది. మీరు నాపై ఎంతో ప్రేమ చూపించారు. అలానే `బిగ్‌బాస్‌ తమిళ` షోని భారతీయ టీవీ చరిత్రలోనే వన్‌ ఆఫ్‌ ద బెస్ట్‌గా నిలిపారు. హోస్ట్‌గా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నా. ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు` అని తెలిపారు కమల్‌. ఈ పోస్ట్ వైరల్‌ అవుతుంది. 

Simbu

ఇదిలా ఉంటే మరి కొత్త హోస్ట్ ఎవరనేది ఇప్పుడు విషయంగా మారింది. హోస్ట్ గా ఎవరు చేస్తారనే చర్చ ప్రారంభమైంది. కొందరు హీరోల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో భాగంగా విజయ్‌ సేతుపతి, శింబు పేర్లు బాగా వినిపిస్తున్నాయి. అయితే ఎవరైతే హోస్ట్ గా బాగుంటుందనే పోలింగ్‌ కూడా తమిళ మీడియాలో, సోషల్‌ మీడియాలో నడుస్తుంది. అందులో భాగంగా ఎక్కువగా శింబు పేరు వినిపిస్తుంది. శింబు అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఏ హీరోని హోస్ట్ గా తీసుకుంటారనేది చూడాలి. విజయ టీవీలో ఈ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. 
 

ఇక కమల్‌ హాసన్‌ ఇటీవల `భారతీయుడు2`, `కల్కి 2898 ఏడీ`తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆయన చేతిలో `థగ్‌ లైఫ్‌` సినిమా ఉంది. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు `భారతీయుడు 3` విడుదల కావాల్సి ఉంది. అలాగే `కల్కి 2`లో నటించాల్సి ఉంది. వీటితోపాటు హెచ్‌ వినోద్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే ఫైట్‌ మాస్టర్స్ అన్బరివ్‌ కాంబినేషన్‌లో సినిమా చేయనున్నారు కమల్‌. ఇలా నాలుగైదు సినిమాలతో ఆయన ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఈ కారణంగానే ఆయన బిగ్‌ బాస్‌ నుంచి తప్పుకున్నారు. 
 

Latest Videos

click me!