నాని సరసన ‘సీతారామం’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. వైరల్ అవుతున్న ఫొటో!

Published : Dec 31, 2022, 02:26 PM ISTUpdated : Dec 31, 2022, 02:28 PM IST

‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). మరోసారి అలరించేందుకు నేచురల్ స్టార్ నానితో నటించబోతున్నట్టు తెలుస్తోంది.   

PREV
16
నాని సరసన ‘సీతారామం’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. వైరల్ అవుతున్న ఫొటో!

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లను అందుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా స్టార్ హీరోల అప్ కమింగ్ ఫిల్మ్స్ కు మృణాల్ పేరు వినిపిస్తోంది. 
 

26

‘సీతారామం’(Sita Ramam)తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. సర్ ప్రైజింగ్ పెర్పామెన్స్ తో ఆకట్టుకుంది. ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్రలో సహజమైన నటనతో కట్టిపడేసింది. తొలిచిత్రంతోనే నటన పరంగా ఆడియెన్స్ తో ఓకే అనిపించుకుంది. 
 

36

దీంతో ప్రస్తుతం టాలీవుడ్ లో మృణాల్ ఠాకూర్ కు అవకాశాలు క్యూ కడుతున్నాయనే చెప్పాలి. తాజాగా సమాచారం ప్రకారం.. నేచురల్ స్టార్ నాని (Nani) సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఫొటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. 
 

46

గెలుపోటములతో సంబంధం లేకుండా వరుస సినిమాలు తెరకెక్కిస్తున్న నాని త్వరలో‘దసరా’(Dasara)తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. సడెన్ గా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తూ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను కూడా అనౌన్స్ చేశారు. వైరా ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌లో చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. 
 

56

సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలను న్యూ ఇయర్‌ కానుకగా జనవరి 1న సాయంత్రం 4గంటల 5నిమిషాలకు వెల్లడించనున్నారు. ఈ క్రమంలో మూవీలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ఎంపికైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు నాని, మృణాల్ ఠాకూర్ కలిసి దిగిన ఓ ఫొటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 
 

66

ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ పేరు హీరోయిన్ గా వినిపిస్తుంటుంటే.. మరోవైపు నాని డెబ్యూ డైరెక్టర్ శౌర్య దర్శకత్వంలో నటించబోతున్నారని తెలుస్తోంది. ‘హృదయం’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ మూవీకి సంగీతం అందించనున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు అందనున్నాయి. కాగా, నాని సినిమాతో మృణాల్ మరో హిట్ అందుకుంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోవడం ఖాయమంటున్నారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories