Korameenu movie Review: `కొరమీను` సినిమా రివ్యూ అండ్‌ రేటింగ్‌

First Published | Dec 31, 2022, 2:05 PM IST

నెపోలియన్‌`తో ఆకట్టుకున్న ఆనంద్‌ రవి హీరోగా నటించిన చిత్రమిది. `హల్‌చల్‌`తో దర్శకుడిగా మెప్పించిన శ్రీపతి కర్రి దీనికి దర్శకత్వం వహించిన `కొరమీను` చిత్రం నేడు శనివారం(డిసెంబర్‌ 31) విడుదలైంది. ఇయర్‌ ఎండ్‌, న్యూ ఇయర్‌ స్పెషల్‌గా రిలీజ్‌ అయిన ఈ సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

మన చుట్టూ జరిగే, మన మధ్యలో నుంచి పుట్టే కథలకు ఎప్పుడూ మంచి ఆదరణ దక్కుతుంది. రా గా ఉండే కథలనే ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారు. అలాంటి కథతో వచ్చిన సినిమా `కొరమీను`. `నెపోలియన్‌`తో ఆకట్టుకున్న ఆనంద్‌ రవి హీరోగా నటించిన చిత్రమిది. `హల్‌చల్‌`తో దర్శకుడిగా మెప్పించిన శ్రీపతి కర్రి దీనికి దర్శకత్వం వహించారు. ఆనంద్‌ రవితోపాటు శత్రు, హరీష్‌ ఉత్తమన్‌, రాజా రవీంద్ర, జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం నేడు శనివారం(డిసెంబర్‌ 31) విడుదలైంది. ఇయర్‌ ఎండ్‌, న్యూ ఇయర్‌ స్పెషల్‌గా రిలీజ్‌ అయిన ఈ సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఉందా? అనేది రివ్యూ(Korameenu Review)లో తెలుసుకుందాం. 
 

కథః
వైజాగ్‌ సమీపంలోని జాలరిపేట అనే మత్య్సకారుల కాలనీలో జరిగే కథ ఇది. ఆ ఏరియాని, చేపల వ్యాపారాన్ని కరుణ(హరీష్‌ ఉత్తమన్‌) శాషిస్తుంటాడు. రాజులా ఏలుతుంటాడు. ఆయన చెప్పిందే వేదం, ఎదురుతిరిగితే చంపేస్తాడు, అందమైన అమ్మాయి కనిపిస్తే చెరిచేస్తాడు. ఆయన వద్ద కోటి(ఆనంద్ రవి) డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. కోటి ఇష్టపడ్డ అమ్మాయి మీనాక్షి(కిషోరీ దత్రక్‌) కరుణ హీరోయిజాన్ని చూసి ఆయన్ని ప్రేమిస్తుంది. ఆయనతో పడుకోవడానికి సిద్దపడుతుంది. కానీ ఆమెని వాడుకుని మోసం చేస్తాడు కరుణ.  ఎంపీ కూతురితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంటాడు. తనని పెళ్లి చేసుకోవాలని నిలదీసిన మీనాక్షి కొట్టి తంతాడు. దీంతో తన అక్కడ ద్వారా కోటి తనని ఇష్టపడుతున్నాడని తెలుసుకుని అతన్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది మీనాక్షి. ఇద్దరు ఫ్రెష్‌గా ప్రేమించుకుంటాడు. తన ముందే వీరిద్దరు కలిసి తిరిగుతుండగా చూసి సహించలేని కరుణ వీరికి వార్నింగ్‌ ఇస్తాడు. ఊరి విడిచి పారిపోవాలని, లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు. అక్కడ ఉంటే కరుణ చంపేస్తాడు, పారిపోయేందుకు డబ్బుల్లేవు. మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లో కోటి, మీనాక్షి ఏం చేశారు? కొత్తగా వైజాగ్‌ కమిషనర్‌గా వచ్చిన మీసాల రాజు(శత్రు) కరుణని ఎందుకు చంపాలనుకున్నాడు? కమిషనర్‌ని కరుణ ఎందుకు ఎందుకు టార్గెట్‌ చేశాడు? ఇందులోని ట్విస్టులేంటనేది మిగిలిన కథ.

Latest Videos


విశ్లేషణః 
ఈగో, అణచివేత, బతుకుపోరాటం అంశాల చుట్టూ తిరిగే చిత్రం `కొరమీను`. చాలా రాగా తెరకెక్కించారు. ఇటీవల ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన `రంగస్థలం`, `పుష్ప` చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. అదే కోవలో ఈ సినిమా కూడా సాగుతుంది. చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. మత్స్యకారుల జీవనాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. అదే సమయంలో అమాయకులను అంగబలం, ఆర్థికబలంతో భయపెడుతూ శాషించే పెద్దోళ్ల అఘాయిత్యాలను ఆవిష్కరించారు. ప్రతిదీ ఇందులో సహజంగా ఆవిష్కరించారు దర్శకుడు శ్రీపతి కర్రి. డైలాగ్‌లు, నటినటుల నటన అంతా చాలా సహజంగా సాగుతుంది. ఎక్కడ ఓవర్‌గానూ, ఎక్కడా తక్కువగానూ ఉండదు, హడావుడి లేదు. నీట్‌గా స్క్రీన్‌ప్లే సాగుతుంది. బీజీఎం సినిమాకి మెయిన్‌ అసెట్‌గా నిలుస్తుంది. 
 

సినిమాలో డైలాగులు, సన్నివేశాలు అన్ని రియలిస్టిక్‌గా ఉంటాయి. అదే మనకు ఓ కొత్త ఫీలింగ్‌ని తీసుకొస్తాయి. తాను ప్రేమించిన అమ్మాయి తన ముందే వేరే వ్యక్తితో పడుకోవడాన్ని చూస్తూ ఉండటం, దానిక అతనే కాపాలాగా ఉండటం హైలైట్‌ పాయింట్‌. మరోవైపు అమ్మాయిని కరుణ్‌ మోసం చేసి కొట్టడం, తన్నే సన్నివేశాలు సైతం చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. మరోవైపు కరుణకి ఎదురుతిరిగి నిలబడే సన్నివేశాలు మరింత ఆకట్టుకునే ఉన్నాయి. ఫస్టాఫ్‌లో ఇదే హైలైట్‌ పాయింట్స్ గా నిలిచాయని. మొదటి భాగం చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. సెకండాఫ్‌ తర్వాత స్లో అయిపోయింది. దర్శకుడు తడబాటు కనిపిస్తుంది. వేగం తగ్గడంతో, కాస్త బోర్‌ ఫీల్‌ని తెప్పిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. అక్కడ హీరోహీరోయిన్లు వేసిన ఎత్తులు ఆకట్టుకుంటాయి. ముగింపు ఆశించిన స్థాయిలో లేదు. 

పోలీస్‌ కమిషనర్‌ కి ఎదురయ్యే షాకింగ్‌ ట్విస్టులు వాహ్‌ అనిపిస్తుంటాయి. శత్రు, ఇమ్మాన్యుయెల్‌, గిరిధర్‌ మధ్య వచ్చే సన్నివేశాలు వినోదాన్ని పంచుతుంటాయి. జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్‌ మంచి వినోదాన్ని పంచారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బాగుంది. దాన్ని ఎలివేట్‌ అయ్యేలాగా చేస్తే ఇంకా బాగుండేది. ఊపొచ్చిన చోట కూల్‌గా సాగడం, హీరో నెమ్మదిగా రియాక్ట్ అవడం వంటి సన్నివేశాలు అసంతృప్తికి గురిచేసేలా ఉంటాయి. ఇదే కథని పెద్ద హీరోతో చేస్తే వంద కోట్ల రేంజ్‌ ఉన్న సినిమా అయ్యేది. యాక్షన్‌, పాటలు పెడితే సినిమా స్థాయే మారేది. 
 

నటీనటులుః
కోటి పాత్రలో ఆనంద్‌ రవి బాగానే మెప్పించాడు. కాకపోతే హవభావాల విషయంలో ఆయన ఇంకా బెటర్‌ గా పలికించాల్సింది. చాలా వరకు ఆయన ఎక్స్ ప్రెషన్స్ ఒకేలా అనిపిస్తుంటాయి. మీనాక్షిగా కిషోరి దత్రన్‌ చాలా బాగా చేసింది. ఆమె పాత్రనే కాదు, ఆమె నటన కూడా అంతే నేచురల్‌గా ఉంది. కమిషనర్‌ మీసాల రాజుగా శత్రు తనదైన నటనతో మెప్పించాడు. కరుణగా హరీష్‌ ఉత్తమన్‌ బాగా చేశాడు. జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్‌ వినోదం బాగుంది. మిగిలిన పాత్రలు కూడా ఫర్వాలేదనిపించాయి. కానీ ప్రధానంగా సినిమా మొత్తం ఆనంద్‌ రవి, శత్రు, కిషోరీ, హరీష్‌ ఉత్తమన్ పాత్రల చుట్టూతే సినిమా తిరుగుతుంది.
 

టెక్నీషియన్లుః
దర్శకుడు శ్రీపతి కర్రి పనితనం కనిపిస్తుంది. ఆయన పడ్డ కష్టం కనిపిస్తుంది. దర్శకుడిగా ఆయనలో మంచి టాలెంట్‌ ఉందని చెప్పొచ్చు. ఇదే కథని పెద్ద కాస్టింగ్‌తో, కమర్షియల్‌ హంగులతో చేస్తే పెద్ద రేంజ్‌ సినిమా అయ్యుండేది. రియలిస్టిక్‌గా ఉండే డైలాగులు, సన్నివేశాలు ఇందులో హైలైట్‌. బీజీఎం సినిమాకి పెద్ద అసెట్‌. సిద్దార్థ్‌ సదాశివుని బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. పాటలు కూడా ఫర్వాలేదు. కథలో భాగంగా వస్తుంటాయి. కార్తీక్ కొప్పెర సినిమాటోగ్రాఫర్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగా చేశాడు. నీట్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. 
 

ఫైనల్‌గాః  మొత్తానికి `కొరమీను` జెన్యూన్‌ అటెంప్ట్. కొత్త కథలను, రియలిస్టిక్‌ కథలను చూసేవారికి నచ్చే చిత్రమవుతుంది.

రేటింగ్‌ః 2.75

న‌టీన‌టులు:
కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటించారు.
 
సాంకేతిక వ‌ర్గం:
ఈ చిత్రానికి పీఆర్వో : నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి బియాండ్ మీడియా, స్టైలిష్: పూజ శేఖర్, ఎడిటర్: విజయ్ వర్ధన్ కె, పాటలు: అనంత నారాయణన్ ఏజీ, ప్రొడక్షన్స్ డిజైనర్: ముసి ఫణి తేజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవన్ కుమార్ జన స్వామి, సినిమాటోగ్రాఫర్: కార్తీక్ కొప్పెర, సౌండ్ డిజైన్: సాయి వర్మ ముదునూరి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సిద్ధార్థ్ సదాశివుని, ప్రొడక్షన్ హౌస్: ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్, మాంగో మీడియా సమర్పణ , డిస్ట్రిబ్యూషన్ : గంగ ఎంటర్టైన్మెంట్స్ , ఆడియో : మాంగో మ్యూజిక్ ,  స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ : ఆనంద్ రవి, డైరెక్టర్: శ్రీపతి కర్రి, నిర్మాత : పెళ్లకూరు సమన్య రెడ్డి.

click me!