Published : Dec 31, 2022, 01:40 PM ISTUpdated : Dec 31, 2022, 01:41 PM IST
న్యూ ఇయర్ వేళ సీనియర్ హీరోయిన్ పూర్ణ (Poorna) గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోతో తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది.
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న వేళ సీనియర్ నటి పూర్ణ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాదే జూన్ లో పెళ్లి పీటలు ఎక్కిన ఈ సుందరి దాంపత్య జీవితంతో సుఖఃసంతోషాలను చూస్తోంది. భర్తను చూసుకుంటూ సమయం గడుపుతోంది.
26
దుబాయ్ కి చెందిన వ్యాపార వేత్త షానిద్ అసిఫ్ అలీ (Shanid Asif Ali)ని పూర్ణ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ త్వరలోనే తల్లిగా ప్రమోషన్ అందుకోబోతోంది.
36
ఈమేరకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఓ స్పెషల్ వీడియో ద్వారా తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. తల్లిద్రండ్రులతో కలిసి ఈ గుడ్ న్యూస్ ను రివీల్ చేసింది. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది.
46
మరోవైపు అభిమానులు కూడా పూర్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న వేళ శుభవార్త చెప్పడం పట్ల సంతోషిస్తున్నారు. అలాగే సినీ తారలు కూడా పూర్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
56
కొన్నాళ్ల పాటు షానిద్ తో ప్రేమ వ్యవహారం కొనసాగించిన పూర్ణ.. కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఇదే ఏడాది పెళ్లి చేసుకొని.. కొద్దినెలలకే మరో గుడ్ న్యూస్ చెప్పడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
66
దాదాపు 18 ఏండ్ల పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక తెలుగు ఆడియెన్స్ కు టీవీ షోతో, సినిమాల ద్వారా ఎంతగానో సుపరిచతమైంది. చివరిగా పూర్ణ ‘అఖండ’ సినిమాతో అలరించింది.