RGV: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తన సినిమాలోని సన్నివేశాలపై ఉన్న స్పష్టత గురించి సిరివెన్నెల గొప్పగా వివరించారు. 'క్షణక్షణం' సినిమాలో "జామురాతిరి జాబిలమ్మ" పాటను సృష్టించే క్రమంలో వర్మ తనకు ఇచ్చిన స్వేచ్ఛను..
తెలుగు సినీ సాహితీ ప్రపంచంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి స్థానం అద్వితీయం. ఆయన పాటల్లో ఉండే గాఢత, భావం ప్రేక్షకులను మంత్రముగ్థులను చేస్తాయి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'క్షణక్షణం' సినిమాలోని పాటలు ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్స్‌గా నిలిచిపోయాయి. ఈ పాటల సృష్టి వెనుక ఉన్న అనుభవాలను సిరివెన్నెల గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
25
ఆర్జీవీ విజన్, స్పష్టత:
రామ్ గోపాల్ వర్మకు తన కథపై, సన్నివేశాలపై అద్భుతమైన స్పష్టత ఉంటుందని సిరివెన్నెల కొనియాడారు. 'క్షణక్షణం' సినిమాలో కేవలం రెండు పాటలకే చోటు ఉందని, అందులో ఒకటి కోటి రూపాయలు దొరికితే మధ్యతరగతి ఆశలు ఎలా ఉంటాయనే దానిపై సీన్ రాయమని వర్మ అడిగారట. ఆ సీన్‌నే పాటగా మార్చడం జరిగింది. వర్మ తన పనిలో ఎంత క్లారిటీగా ఉంటారంటే, "మీరు రామాయణం రాసినా, మరేది రాసినా నేను ఎలా తీయాలో అలాగే తీస్తాను" అని చెప్పేంత ధైర్యం ఆయనది.
35
జామురాతిరి జాబిలమ్మ - ఒక అద్భుతం:
ఈ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన "జామురాతిరి జాబిలమ్మ" పాట గురించి చెబుతూ.. అది కేవలం ఒక హీరో హీరోయిన్ కోసం పాడే పాట కాదని శాస్త్రి వివరించారు. అడవిలో భయపడుతున్న ఒక చిన్న పాపాయిని ఓదార్చే తండ్రిలా లేదా ఒక నిష్కల్మషమైన స్నేహితుడిలా ఈ పాటను రాశానని చెప్పారు. అతిలోక సుందరి శ్రీదేవిని ముఖానికి బురద పూసి ఒక గొయ్యిలో కూర్చోబెట్టి, ఆమె అందాన్ని కాకుండా ఆమెలోని అమాయకత్వాన్ని(పాపాయి మనస్తత్వాన్ని) చూపిస్తూ పాట పాడించడం వర్మ గొప్పతనం అని ఆయన అన్నారు.
సినిమా కథకు సంబంధం లేకపోయినా, వినడానికి ఆహ్లాదకరంగా ఉండేలా అక్షరాలను పేర్చడంలో సిరివెన్నెలసిద్ధహస్తులు. "అందనంత ఎత్త తారా తీరం ఎందుకందా" వంటి పద ప్రయోగాలు సన్నివేశానికి ఒక కొత్త అందాన్ని తెచ్చాయని ఆయన గుర్తు చేసుకున్నారు.
55
ఒక అద్భుతమైన పాట..
దర్శకుడు క్రియేట్ చేసిన వాతావరణం, నటీనటుల ప్రతిభ, గాయకుల గళం అన్నీ కలిస్తేనే ఒక అద్భుతమైన పాట పుడుతుందని, తన బాధ్యత కేవలం ఆ భావాలను అక్షరాల్లోకి తర్జుమా చేయడం మాత్రమేనని ఆయన వినమ్రంగా చెప్పారు.