Prasad Behara: మాసిన బట్టలతో ఉన్నందుకు.. తింటుంటే మెడపట్టుకుని తోసేశారు..

Published : Apr 10, 2026, 12:44 PM IST

Prasad Behara: సినీ పరిశ్రమలో గుర్తింపు లేని సమయంలో ఒక నటుడిగా, రచయితగా ప్రసాద్ బెహరా పడ్డ కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఒక సినిమా షూటింగ్ సమయంలో కేవలం లుంగీ కట్టుకుని మాసిపోయిన బట్టలతో ఉన్నందుకు.. 

PREV
15
మాసిన బట్టలతో ఉన్నందుకు..

యూట్యూబ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రసాద్ బెహరా వెనుక ఎంతో సంఘర్షణ ఉంది. ప్రస్తుత సక్సెస్ వెనుక ఆయన పడిన అవమానాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, షూటింగ్ సెట్స్‌లో ఎదురైన ఒక దారుణమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు.

25
వేషధారణను బట్టి అవమానం

హెబ్బా పటేల్ నటించిన 'గీత' సినిమా షూటింగ్ సమయంలో ప్రసాద్ ఒక చిన్న తాగుబోతు పాత్రను పోషించారు. పాత్ర డిమాండ్ మేరకు ఆయనకు ఒక మాసిపోయిన పాత లుంగీని కాస్ట్యూమ్ కింద ఇచ్చారు. షూటింగ్ విరామ సమయంలో అందరితో కలిసి టిఫిన్ చేద్దామని కూర్చున్న ప్రసాద్‌ను, అక్కడున్న ఒక వ్యక్తి "ఎక్కడ కూర్చోవాలో తెలియదా?" అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ మెడపట్టుకుని బయటకు తోసేశారు. ఆయన వేసుకున్న బట్టలను చూసి ఆయనను ఒక జూనియర్ ఆర్టిస్ట్‌గా భావించి అలా ప్రవర్తించారని ప్రసాద్ తెలిపారు.

35
నిరూపించుకున్న తర్వాత గౌరవం

అదే రోజు షూటింగ్‌లో ప్రసాద్ తన డైలాగ్స్‌ను అద్భుతంగా చెప్పడం చూసిన తర్వాత అక్కడి వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం భోజనం సమయంలో, ఉదయం తోసేసిన అదే వ్యక్తి ప్రసాద్ దగ్గరకు వచ్చి, "క్షమించండి.. మీరు పెద్ద ఆర్టిస్ట్ అని నాకు తెలియదు" అని అడిగి మరీ చికెన్ వడ్డించారట. మనుషులు వేసుకున్న బట్టలను చూసి గౌరవం ఇవ్వడం ఎంత దారుణమో ఈ సంఘటన తనకు నేర్పించిందని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

45
కుటుంబ నేపథ్యం, ఇష్టాలు:

ప్రసాద్ తల్లి ఒక అంగన్‌వాడీ టీచర్. తన కొడుకు నెలకు 15 వేలు సంపాదిస్తే చాలు సెటిల్ అయిపోయినట్లేనని ఆమె భావిస్తారట. సినిమాల్లోకి రాకముందు ఆయన కార్ షోరూమ్‌లలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా, టీమ్ లీడర్‌గా పనిచేశారు.

55
ఫేవరెట్ హీరో స్టైల్

తన ఫేవరెట్ హీరో దిగ్గజ నటుడు ఏఎన్ఆర్ అని, ఆయన స్టైల్ అంటే తనకు చాలా ఇష్టమని ప్రసాద్ పంచుకున్నారు. ఇప్పుడు తన రైటింగ్ స్టైల్ చూసి దర్శకులు సుజిత్, సాయి ప్రసాద్ వంటి వారు స్వయంగా మెసేజ్ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ఆయన అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories