అట్లీ తిట్టాడు.. బోరున ఏడ్చానంటున్న సిరి హనుమంత్, జవాన్ అవకాశం ఎలా వచ్చిందంటే..?

First Published | Sep 19, 2023, 10:24 AM IST

జవాన్ సినిమాలో అనూహ్యంగా మెరుపులు మెరిపించింది.. బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్. ఈసినిమాలో అవకాశం ఎలా వచ్చింది... డైరెక్టర్ అట్లీ తనను ఎందుకు తిట్టాడు లాంటి విషయాలు వెల్లడించింది చిన్నది. 
 

బాలీవుడ్ కింగ్..  షారుఖ్ ఖాన్(Shahrukh Khan) నటించిన తాజా సినిమా జవాన్. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈసినిమా.. బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈమూవీలో విజయ్ సేతుపతి విలన్ గా నటించి మెప్పించారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జవాన్(Jawan)భారీ విజయం సాధించింది. అయితే ఈసినిమాలో తెలుగు పిల్ల సిరి హనుమంత్ సర్ప్రైజింగ్ రోల్ చేసింది. 

బాక్సాఫీస్ దగ్గర దాదాపు 800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈసినిమా.1000 కోట్ల కలెక్షన్ మార్క్ కు దగ్గరగా ఉంది.ఈసినిమాలో నయనతార తో పాటుగా.. దీపికా పదుకొనే, ప్రియమణి లాంటి స్టార్స్ నటించగా.. అటువంటిస్టార్స్ తో కలిసి నటించే అవకాశం సాధించింది.. టాలీవుడ్ బుల్లితెర బ్యూటీ సిరి హనుమంత్.  


జవాన్ సినిమాలో ఓ లేడీ పోలీస్ టీమ్ ఉంది. ఈ టీమ్ లో  మన తెలుగు యూట్యూబర్, సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంతు కు మంచి పాత్ర లభించింది. ఈమూవీలో కొన్నిసీన్స్ లో కనిపిస్తుంది సిరి. అది కూడా షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లోని సీన్స్ లో సిరి కనిపించడం విశేషం  అయితే ఈ విషయం సిరి సినిమాలో కనిపించేవరకూ ఎవరికీ తెలియదు. సిరిని జవాన్ సినిమాలో చూసి తెలుగు ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. 
 

సినిమాలో షారుఖ్ – సిరి కాంబినేషన్ లో సీన్స్ కూడా ఉన్నాయి. దీంతో ఆ అమ్మాయి జవాన్ సినిమా దాకా వెళ్లిందా, షారుఖ్ తో యాక్ట్ చేసిందా అని షాక్ అయ్యారు.జవాన్ సినిమా తర్వాత సిరి మరింత పాపులర్ అయింది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరి జవాన్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. 
 

జవాన్ లో నటించే అవకాశం తనకు విచిత్రంగా వచ్చిందన్నారు సిరి. ఈసినిమాలో నటించడానికి  ఫోన్ వచ్చినప్పుడు..ముందు తను నమ్మలేదట.. అది ప్రాంక్ కాల్ అని లైట్ తీసుకుందట. ఆ తర్వాత మేనేజర్ కూడా ఫోన్ చేసి చెప్పడంతో షాక్ అయ్యాను అన్నారు సిరి. షూటింగ్ కోసం ముంబై వెళ్ళాను. సెట్స్ లో షారుఖ్ గారిని చూసేదాకా నమ్మకం కలగలేదు. అంతా అయోమయంగా అనిపిచింది అన్నారు సిరి. 

ఇక  సెట్స్ కి వెళ్ళాక కూడా ఇది నిజంగానే షారుఖ్ సర్ సినిమానా అని చాలా మందిని అడిగాను. మొదటి సారి షూటింగ్ కి ముంబై వెళ్లడంతో భయం అనిపించి శ్రీహన్ ని తోడు తీసుకెళ్ళాను అని తెలిపింది.అలాగే.. నేను తెలుగమ్మాయి అని అట్లీ గారికి తెలీదు. నన్ను కూడా హిందీ అమ్మాయి అనుకున్నారు. ఇక తనను ఓ సందర్భంలో అట్లీ తిట్టాడు కూడా అని అన్నది బిగ్ బాస్ బ్యూటీ. 

 ఒక సీన్ లో డైలాగ్ సరిగ్గా చెప్పలేక దాదాపు ఏడు టేక్స్ తీసుకున్నాను. దాంతో అట్లీ సర్ బాగా తిట్టడంతో ఏడ్చేశాను. షారుఖ్ గారు నా దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని మోటివేట్ ఇచ్చారు. అసలు ఆయనతో నటించడమే ఒక కలలా ఉందంటే, ఆయన నా దగ్గరికి వచ్చి మోటివేట్ చేయడం ఎప్పటికి మర్చిపోలేను అని జవాన్ కబుర్లు చెప్పారు సిరి. 
 

యూట్యూబర్ గా లైఫ్ స్టార్ట్ చేసి.. టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయ్యింది సిరి. షార్ట్ ఫిల్మ్స్ తో తెలుగు ప్రేక్షకుల మనసుదోచింది. బిగ్ బాస్ అవకాశం సాధించి.. టాప్ 5 గా నిలిచింది. మరో బుల్లితెర స్టార్ శ్రీహాన్ తో పీకల్లోతు ప్రేమలో పడిన సిరి.. శ్రీహాన్ తో సహజీవనం చేస్తోంది. 

Latest Videos

click me!