ఉట్టి కొట్టేటప్పుడు రెండు గ్రూపులుగా విడిపోతారు దివ్య, జాహ్నవి. జాహ్నవి పక్కన బసవయ్య, రాజ్యలక్ష్మి ఉంటే దివ్య పక్కన నందగోపాల్ వస్తాడు. విక్రమ్ ని తనవైపు రమ్మంటుంది జాహ్నవి. కానీ విక్రమ్ దివ్య వైపు వెళ్తాడు. అయితే ఆటలో జాహ్నవి గెలిచేలాగా ఉట్టి కిందకు దించి ఉంచుతాడు విక్రమ్ దాంతో ఉట్టిని సులభంగా కొట్టేస్తుంది జాహ్నవి. మరదల్ని గెలిపించుకోవడానికి ఈ పార్టీలో చేరావా అని మనసులో అనుకుంటుంది దివ్య.