Siri Hanumanth : జబర్దస్త్ కి సిరి హనుమంత్ గుడ్ బై ? ఎక్కడ తేడా జరిగిందో.. ఆమె సమాధానం ఇదే..

Published : Mar 04, 2024, 04:43 PM IST

సిరి హనుమంత్ జబర్దస్త్ లో యాంకరింగ్ మొదలు పెట్టి కొన్ని నెలలే అవుతోంది. ఇంతలోనే ఆమె జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేస్తోందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

PREV
16
Siri Hanumanth : జబర్దస్త్ కి సిరి హనుమంత్ గుడ్ బై ? ఎక్కడ తేడా జరిగిందో.. ఆమె సమాధానం ఇదే..

 బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామర్ బ్యూటీ, యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సీజన్ లో సన్నీ విజేతగా నిలిచాడు. ఆమె స్నేహితుడు షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. సిరి టాప్ 5 కి చేరుకుంది. 

26

బిగ్ బాస్ 5తో సిరి క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే నటిగా కూడా రాణిస్తోంది. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6లో సిరి ప్రియుడు శ్రీహాన్ రన్నరప్ సాధించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా సిరి, శ్రీహాన్ ప్రేమలో ఉన్నారు. 

36

అయితే ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ తో క్లోజ్ గా మూవ్ కావడంతో అనేక రూమర్లు వినిపించాయి. సిరి.. షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉండడం వల్లే దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది అనే ప్రచారం కూడా జరిగింది. ఇదంతా పక్కన పెడితే సిరి ప్రస్తుతం కెరీర్ లో ఒక్కో మెట్టు ఎదుగుతోంది. ప్రస్తుతం యాంకర్ గా పలు షోలు చేస్తోంది.  జబర్దస్త్ లో వరుసగా యాంకర్స్ మారుతూనే ఉన్నారు. 

46

గతంలో అనసూయ యాంకరింగ్ చేస్తుండగా ఆమె స్థానంలో సౌమ్య రావు వచ్చింది. ఆమె కూడా జబర్దస్త్ నుంచి తొలగింది. అంతే సౌమ్యరావు జబర్దస్త్ నుంచి ఎందుకుతప్పుకుంది అనేది స్పష్టంగా తెలియదు. ఇప్పుడు ఆమె స్థానంలో సిరి హనుమంత్ వచ్చింది.

56

సిరి హనుమంత్ జబర్దస్త్ లో యాంకరింగ్ మొదలు పెట్టి కొన్ని నెలలే అవుతోంది. ఇంతలోనే ఆమె జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేస్తోందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోనే అందుకు కారణం. ఈ ప్రోమోలో జబర్దస్త్ కమెడియన్ చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి. 

 

66

నూకరాజు సిరి దగ్గరకి వెళ్లి.. సిరి హనుమంత్.. జస్ట్ ఫర్ వన్ మంత్ అని అంటాడు. అవి ఎవరో కావాలని చేసిన కామెంట్స్ అని సిరి అంటుంది. అంటే మీరు కంటిన్యూ అవుతారా అని నూకరాజు అడుగుతాడు.. అవును నేనే కంటిన్యూ అవుతా అని చెబుతుంది. సరే చూద్దాం లే అని నూకరాజు వెటకారంగా చెప్పడం మరింత అనుమానాలు పెంచుతోంది. సిరి ఎక్కువ కాలం జబర్దస్త్ యాంకర్ గా ఉంటుందా లేక అనసూయ, సౌమ్యరావు లాగా టాటా చెప్పేస్తుందా అనేది వేచి చూడాలి. 

click me!

Recommended Stories