టాలీవుడ్ లో దర్శకుడు ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) క్రియేట్ చేసిన రికార్డును క్రాస్ చేసేందుకు ముగ్గురు స్టార్ డైరెక్టర్లు పోటీపడుతున్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభాస్ (Prabhas) వారి ఆయుధంగా మారడం విశేషం.
దర్శకధీరుడు, టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఇండియాలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా నిలిచారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)తో ‘బాహుబలి’ (Baahubali) చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే.
26
బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో రాజమౌళి వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా సత్తాను చాటారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గ్రాస్ వసూల్ చేసిన రెండో భారతీయ చిత్రంగా Baahubali 2 నిలిచింది. రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
36
అయితే ఇప్పుడు ఈ టార్గెట్ ను ముగ్గురు డైరెక్టర్లు క్రాస్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు ప్రభాస్ నే తమ ఆయుధంగా వాడుకుంటున్నారు. భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. వారు ఆ సినిమాలపై పెట్టుకున్న అంచనాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
46
‘కేజీఎఫ్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) చివరిగా ప్రభాస్ తో ‘సలార్’ (Salaar Cease Fire) చిత్రంతో వచ్చారు. కానీ ఈ సినిమా వెయ్యి కోట్లు క్రాస్ చేయలేకపోయింది. అయితే అసలు కథంతా Salaar 2లోనే ఉండటంతో శౌర్యంగ పర్వంతో నీల్ రూ.2000 కోట్ల వరకు వసూళ్లు రాబడుతారని తెలుస్తోంది.
56
ఇక క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) కూడా ప్రభాస్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ కే.. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) చిత్రంతో రాబోతున్నారు. పాన్ వరల్డ్ గా హాలీవుడ్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. మే 10న విడుదల కానునన్న ఈ చిత్రం కూడా రూ.2 వేల కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు.
66
డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) - ప్రభాస్ కాంబోలో ‘స్పిరిట్’ (Spirit) రాబోతున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ నేపథ్యంలో.. అలాగే ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతో సందీప్ కచ్చితంగా రూ2000 కోట్లు వసూళ్లు చేస్తారని అంటున్నారు. ఇలా ఈ ముగ్గురు డైరెక్టర్లు జక్కన్న ఫిక్స్ చేసిన టార్గెట్ ను రీచ్ అయ్యే పనిలో నిమగ్నమయ్యారు.