Siri Hanumanth: సిరి హనుమంత్‌ బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌కి ఎంత తీసుకుందో తెలుసా? అన్వేష్ మాటలకు రక్తకన్నీరే

Published : Apr 07, 2025, 04:24 PM ISTUpdated : Apr 07, 2025, 04:27 PM IST

Siri Hanumanth: బెట్టింగ్ యాప్స్‌ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా యాప్స్‌ ప్రమోట్‌ చేస్తున్న అనేక మంది తెలుగు సెలబ్రిటీలు, బుల్లితెర నటులు, యూట్యూబర్స్‌, ఇన్‌ఫ్ల్యూయన్సర్లపై పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. బెట్టింగ్‌ యాప్స్‌ని ప్రమోట్‌ చేస్తున్న వారిలో అబ్బాయిలతోపాటు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇక వైజాగ్‌కి చెందిన మన తెలుగమ్యాయి బిగ్‌బాస్‌ ఫేమ్‌ సిరి హనుమంతు బెట్టింగ్‌ యాప్‌లను ప్రచారం చేసి ఎంత సంపాదించిందో తెలిస్తే మీరూ షాక్‌ అవుతారు.  

PREV
15
Siri Hanumanth: సిరి హనుమంత్‌ బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌కి ఎంత తీసుకుందో తెలుసా? అన్వేష్ మాటలకు రక్తకన్నీరే
Siri Hanumanth

సిరి హనుమంతుది విశాఖపట్నం. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో సిరి ఆలనాపాలనా తల్లే చూసుకుంది. చిన్ననాటి నుంచి యాక్టివ్‌గా ఉండే సిరి.. టిక్‌టాక్ వల్ల ఫేమస్‌ అయ్యింది. చూడ్డానికి గ్లామరస్‌గా ఉండటంతో అలా సినిమావాళ్ల దృష్టిలో పడింది. ఆ తర్వాత బిగ్‌బాస్‌ సీజన్‌ -4కి ఎంపికైంది. బిగ్‌బాస్‌లో షణ్ముక్‌తో ప్రేమాయణం నడిపి నెగిటివిటీ మూటగట్టుకుంది. ఇక బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన దగ్గరి నుంచి తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేయడం సిరి ప్రారంభించిందని అలా కోట్ల రూపాయలు సంపాదించిందని నా అన్వేషణ యూట్యూబర్‌ అన్వేష్‌ రీసెంట్‌గా బయటపెట్టారు. 

25
Siri Hanumanth

సిరి కొన్నేళ్లు యాంకర్‌గా కూడా పనిచేసింది. జబర్దస్త్ షోకి కొన్ని ఎపిసోడ్స్‌కి పనిచేసి ఆ తర్వాత కనిపించలేదు. తీరా ఏమైందని అడిగితే.. జబర్దస్లే వాళ్లే యాంకర్‌ నుంచి తొలగించారని చెప్పుకొచ్చింది సిరి. ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి వ్యాపారం ప్రారంభించింది. ఒకవైపు అడపాదడపా సినిమాలు, షోలు చేస్తూ... మరోవైపు వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టింది. 

35
Siri Hanumanth

ఇక బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్స్‌లో సిరి హనుమంత్‌ గట్టిగా సంపాదించిందట. ఇప్పటికే హైదరాబాద్‌, వైజాగ్‌, విజయవాడ ప్రాంతాల్లో మూడు విలాసవంతమైన బ్యాటీ క్లినిక్‌ను ఏర్పాటు చేసిందట. వీటి ప్రమోషన్‌లో భాగంగా 30 మంది సెలబ్రిటీలను హైదరాబాద్‌ నుంచి ఏకంగా వైజాగ్‌కు తన సొంత ఖర్చులతో ఫ్లైట్‌ టికెట్లు వేసి పిలిపించింది. దీనికి సెలబ్రిటీ యూట్యూబర్‌ హర్షసాయి కూడా రావడం కొసమెరుపు. అంతేకాదు.. షణ్ముక్‌ మాజీ ప్రియురాళు దీప్తి సునయన కూడా సిరి బ్యూటీ క్లినిక్‌ రావడం విశేషం. 

45
Siri Hanumanth

సిరి హనుమంత్‌ ప్రారంభించిన మూడు క్లినిక్ల ఏర్పాటుకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చు చేసిందని ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌ చెబుతున్నాడు. దీంతోపాటు మరో రూ.4 కోట్లను పెట్టుబడికోసం ఉంచుకుందని, మొత్తం రూ.10 కోట్లను బెట్టింగ్‌ యాప్‌లను ప్రచారం చేయడం వల్ల సిరి అక్రమంగా డబ్బు సంపాదించిందని తన యూట్యూబ్‌ ఛానల్‌లో అతను ఆరోపణలు చేశాడు. 

 

55
Naa Anveshana avinash

సిరి ఏర్పాటు చేసిన బ్యాటీ పార్లర్‌లో ఒక సిట్టింగ్‌కి రూ.80వేల వరకు తీసుకుంటోందని అన్వేష్‌ చెబుతున్నాడు. బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసి ఎంతో మందిని బలితీసుకున్న పాపం సొమ్ముతో వాటిని నడుపుతోందని ఆరోపించారు. అంతేకాకుండా తన బ్యూటీ పార్లర్‌కి వచ్చిన నల్లగా ఉన్నవారిని తెల్లగా చేస్తుందని ప్రచారం కూడా చేస్తుందని అన్నాడు. తండ్రి లేని అమ్మాయి.. ఆస్తులు లేవు, ఏమీ లేవు.. రాత్రికి రాత్రే ఇంత డబ్బు రావడం ఎలా సాధ్యమవుతుందని సిరిని అన్వేష్‌ ప్రశ్నించాడు. 

Read more Photos on
click me!

Recommended Stories