Published : Apr 07, 2025, 03:23 PM ISTUpdated : Apr 07, 2025, 03:25 PM IST
డిజే టిల్లు ఫాదర్ క్యారెక్టర్ చేసిన నటుడు మురళీధర్ గౌడ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణకు చెందిన ఆయన ఆ స్లాంగ్‌లో డైలాగులు చెబుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హీరో, హీరోయిన్లకు తండ్రి పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్నారు. ఇక డీజీ టిల్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీధర్ గౌడ్ ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే నిజంగా ఎవరైనా కంటతడి పెట్టేస్తారు. ఆయన అనుభవాలు తెలుసుకుంటే మీ కష్టాలను కూడా మరిచిపోతారు.
సినిమా ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగా..
నటుడు మురళీధర్ గౌడ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, సినిమా రంగంలో ఏ విధంగా అవకాశం వచ్చింది వంటి అనేక విషయాలు పంచుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన కరెంట్ ఆఫీస్‌లో అకౌంటెంట్‌గా పనిచేసేవారంట. ఉద్యోగ విరమణ తర్వాత అప్పటికే నటనపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలో యాక్టర్‌గా నిలదొక్కుకోవాలని ఆరు పదుల వయసులో లక్ష్యంగా పెట్టుకున్నారంట. తొలిరోజుల్లో ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి ఒక్క వేషం ఇవ్వమని బతిమాలినా ఎవరూ పట్టించుకోలేదని మురళీధర్ గౌడ్ చెబుతున్నారు.
25
Muralidhar Goud Journey: DJ Tillu's Father Overcomes Poverty to Become a Star
కడుపునిండా అన్నం కూడా ఎప్పుడూ తినలేదు..
చిన్నప్పటి నుంచి కఠిక పేదరికాన్ని అనుభవించానని మురళీధర్ చెప్పుకొచ్చారు. వారి తల్లిదండ్రులకు అయిదుగురు సంతానమని, చిన్పప్పుడు వేసుకోవడానికి కనీసం బట్టలు కూడా సరిగా ఉండేవి కాదని, చెప్పులు కూడా ఉండేవి కాదని మురళీధర్ బాధపడ్డారు. కడుపు నిండా భోజనం కూడా ఉండేది కాదని, సంక్రాంతి, దసరా పండుగలకు మాత్రమే ఇంట్లో బగారా రైస్‌తో కడుపునిండా తినేవాడినని ఆయన చెప్పారు. ఉడికించిన గుడ్డు ముగ్గురు తినేవారమని అన్నారు. అప్పుడే పెద్దయ్యాక కోట్లు సంపాదించాలని కసిగా నిర్ణయం తీసుకున్నానన్నారు.
35
Muralidhar Goud Journey: DJ Tillu's Father Overcomes Poverty to Become a Star
బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాలు చేశా..
తొలినాళ్లలో సినిమాల్లో నటించాలని ఉన్నా.. అసలు ఇండస్ట్రీ గురించి అవగాహన లేదని మురళీధర్ చెప్పారు. మొదట్లో ఎక్కడ సినిమా ఆఫీస్ పెడుతున్నారు అంటే అక్కడికి వెళ్లి ఫోటోలు ఇవ్వడం రావడం జరిగిందని, కానీ ఒక్కరు కూడా వేషం ఇవ్వలేదన్నారు. కనీసం ఏదైనా ఆడిషన్ తీసుకోమని అడిగినా అవసరం లేదు మేమే ఫోన్ చేస్తాం అని చెప్పి వెనక్కి పంపించే వారంట. అయినా కూడా నిరాశ చెందకుండా రోజూ షూటింగ్స్ జరిగే చోటుకి వెళ్లి అసలు సినిమా ఎలా తీస్తారు. ఆర్టిస్టులు ఎలా నటిస్తున్నారు అని దగ్గరి నుంచి పరిశీలించేవాడిని అని మురళీధర్ చెబుతున్నారు. ఒక్కసారిగా సినిమాలో క్యారెక్టర్ ఇవ్వడం అంటే కష్టం కాబట్టి ముందు రోజువారీ బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్‌గా నటించినట్లు చెప్పుకొచ్చారు.
45
Muralidhar Goud Journey: DJ Tillu's Father Overcomes Poverty to Become a Star
వందల ఆడిషన్స్ తర్వాత..
బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్‌గా రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత కూడా గుర్తింపు రాలేదని, చివరికి కృష్ణం రాజు డైలాగులు బట్టికొట్టి ఆడిషన్స్‌కి వెళ్లిన ప్రతిచోట అది చెప్పేవారంట. అలా కొన్ని వందల ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత అదృష్టం కొద్దీ డీజీ టిల్లు సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పారు మురళీధర్ గౌడ్. డీజీటిల్లు సినిమా అనంతరం మంచి పేరు రావడంతో వరుస సినిమా అవకాశాలు వచ్చాయంటున్నారు. ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తను నటించిన అన్ని సినిమాలు దాదాపు సక్సెస్ అవుతున్నాయని, ఇది తన అదృష్టం అని అంటున్నారు.
55
Murali Goud's Journey: DJ Tillu's Father Overcomes Poverty to Become a Star
అలా అదృష్టం కలిసి వచ్చింది..
సినిమాల్లో బిజీగా ఉంటూ బాగా డబ్బులు సంపాదిస్తున్నా.. మూలాలు మర్చిపోనని మురళీధర్ అంటున్నారు. డబ్బు సంపాదిస్తున్నా డౌన్ టు ఎర్త్ ఉండాలని పేదరికంలో ఉంటున్నట్లే బతకాలని అంటన్నారు మురళీధర్. సక్సెస్, ఫెయిల్యూర్ చీకటి వెలుగు లాంటివని సక్సెస్ ఎన్నినాళ్లు ఉంటుందో చెప్పలేమన్నారు. ఇక చాలా మంది ఇతరులను చూసి ఈర్ష పడుతుంటారని అలా చేస్తే వారు పైకి రారని అన్నారు. మనకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని పైకి రావాలని, ఎదుటి వారితో కంపేర్ చేసుకుంటే ముందుకెళ్లలేమన్నారు. ఇప్పటికీ తాను కర్మఫలాన్ని నమ్ముతుంటానని చెప్పారు. అదృష్టం లేకపోతే ఎవరూ ఉన్నత స్థాయికి చేరుకోలేరని కానీ కసితో కష్టపడే ప్రతి వ్యక్తినీ అదృష్టం ఏదో ఒకరూపంలో తలుపు తడుతుందని మురళీధర్ గౌడ్ చెబుతున్నారు.