Pravasthi, Singer Sunitha
పాడుతా తీయగా షో గురించి యువ గాయని ప్రవస్తి చేసిన కామెంట్స్ సంచలనం అవుతున్నాయి. ఇంత కాలం ఎలాంటి వివాదం లేకుండా సాగిన పాడుతా తీయగా షో గురించి ప్రస్తుతం నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సింగర్ ప్రవస్తి చేసిన వ్యాఖ్యలతో బుల్లితెర షోలలో జడ్జీలు కూడా వివక్షతో వ్యవహరిస్తారా.. అక్కడ కూడా అమ్మాయిలకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా అనే అనుమానాలు మొదలయ్యాయి. పాడుతా తీయగా షో తెరవెనుక జరుగుతున్న చాలా విషయాలని, తనకి జరిగిన అన్యాయాన్ని ప్రవస్తి వీడియో రూపంలో వివరించింది.
singer pravasthi aradhya
పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సిరీస్
ప్రస్తుతం పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సిరీస్ గ్రాండ్ గా సాగుతోంది. ఈ సిరీస్ లో ప్రవస్తి కూడా పాల్గొని ఎలిమినేట్ అయింది. పాడుతా తీయగా షో ప్రొడక్షన్ తీరు బాగాలేదని, కనీసం కాస్ట్యూమ్ డిజైనర్స్ కూడా అమ్మాయిలకు మర్యాద ఇవ్వరని పేర్కొంది. చీర నడుము కిందికి కట్టుకుని ఎక్స్ ఫోజ్ చేయమంటారు. బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడతారు. బాలు సార్ ఉన్నప్పుడు షో ఎంతో బావుండేది.
Padutha Teeyaga
ప్రవస్తి ఆవేదన ఇదే
ఇప్పుడున్న జడ్జీలు కీరవాణి, సునీత, చంద్రబోస్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి నేనంటే పడదు. అది ఎందుకో అర్థం కావడం లేదు. కనీసం లిరిక్స్ కూడా గుర్తుపెట్టుకోలేని సింగర్స్ ని వీళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ నాలాగా బాగా పాడే వారిని ఏదో ఒక వంకతో తిడతారు అని ప్రవస్తి ఆవేదన వ్యక్తం చేసింది. తాను శ్రీరామదాసు చిత్రంలో అంతా రామమయం అనే పాట పాడినప్పుడు కీరవాణి, సునీత, చంద్రబోస్ ముగ్గురూ తప్పులు వెతికారని, బాగా పడినప్పటికీ నెగిటివ్ గా మాట్లాడారని ప్రవస్తి తెలిపింది.
Singer Sunitha
శ్రీరామదాసు వెనుక సునీత కష్టం
అసలు ప్రవస్తి పాడిన 'అంతా రామమయం' సాంగ్ సునీత, కీరవాణి, చంద్రబోస్ కి ఎందుకు నచ్చలేదు ? వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రవస్తి పాట పాడిన తర్వాత సింగర్ సునీత శ్రీరామదాసు చిత్రంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. శ్రీరామదాసు నా కెరీర్ లో చాలా స్పెషల్ మూవీ. ఆ చిత్రంలో పాటలు పాడే అవకాశాన్ని కీరవాణి సార్ నాకు ఇచ్చారు. అదే విధంగా స్నేహకి డబ్బింగ్ చెప్పాను. ఆడియో రిలీజ్ ఈవెంట్ ని నేనే హోస్ట్ చేశాను.
నువ్వు ఈ పాటని పాడిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే.. ఇది నీ ఛాయిస్ కదా. కొన్ని సందర్భాల్లో ఈ పాటని చాలా స్మార్ట్ గా పాడాలి. నువ్వు పాడిన పాటల ద్వారా స్మార్ట్ నెస్ అనేది నీకు అనుభవంతో వచ్చింది. నువ్వు చాలా బాగా మేనేజ్ చేస్తున్నావు. కానీ కొంచెం జాగ్రత్త తీసుకుని నీ కంఫర్టబుల్ స్కేల్ లో ఉన్న పాటలని ఎంపిక చేసుకోమని చెప్పడం సులువేమో.. కానీ నీ మైండ్ లో ఏముందో నాకు తెలియదు.
నీ వాయిస్ కి తగ్గ పాటలని ఎంచుకోవాలి
ఈ పాట అక్కడక్కడా బాగానే అనిపించింది. కానీ అక్కడక్కడా భక్తి భావం కొరవడింది ఏమో అని అనిపించింది. నీ పాటతో కనెక్ట్ అయ్యే ఉంటున్నాం. కానీ వేరియేషన్ ప్రదర్శించాల్సిన చోట ఇబ్బందిగా అనిపిస్తోంది. అలాంటి ఇబ్బందికర పరిస్థితిలో పడకూడదని ఇదంతా చెబుతున్నా. నీ గాత్ర ధర్మానికి తగ్గ పాటలని ఎంచుకుంటే బావుండేది అని సునీత సుతిమెత్తగా ప్రవస్తికి చురకలు అంటించింది.
M M Keeravani
అది సునీత గొప్పతనం, కీరవాణి ప్రశంసలు
కీరవాణి మాట్లాడుతూ.. ప్రవస్తి బాగా పాడవమ్మా. పైస్థాయికి వెళ్ళినప్పుడు బాగా మేనేజ్ చేశావు. మేనేజ్ చేయడం బాగాలేకపోతే గొంతు పీలగా అనిపిస్తుంది. కానీ నువ్వు కంట్రోల్ చేయగలిగావు. ప్రవస్తి నీ అవస్థలు చూస్తున్నా. అవస్థలు పడ్డప్పటికీ నువ్వు సఫలీకృతం అయ్యావు. శ్రీరామదాసు పాటల రీరికార్డింగ్ కోసం టాప్ సింగర్స్ ని కోరస్ పాడడానికి తీసుకొచ్చా. కోరస్ పాడిన వాళ్లలో సునీత గారు కూడా ఉన్నారు. అప్పటికే ఆమె మంచి సింగర్ గా ఎదిగారు. కానీ కోరస్ పాడడానికి ఒప్పుకున్నారు. అది ఆమె గొప్పతనం. రామ కార్యానికి ఉడుత సాయం అన్నట్లు.. ఆ చిత్రానికి ఏ పని ఇచ్చిన మనం చేద్దాం అనే యాటిట్యూడ్ తో సునీత ముందుకు వచ్చారు. అందుకే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి అని కీరవాణి అన్నారు.