హీరోయిన్లని మించిన అందంతో మెస్మరైజ్‌ చేస్తున్న సింగర్‌ సునీత.. చూపుతిప్పుకోవడం కష్టమే.. కిల్లింగ్‌ స్మైల్‌

Published : Jan 03, 2022, 06:39 PM IST

సింగర్‌ సునీత సెకండ్‌ మ్యారేజ్‌ తర్వాత దూసుకుపోతుంది. ఓ రకంగా ఆమెకి రెండో పెళ్లి కలిసొచ్చిందని చెప్పొచ్చు. రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతుంది. ఓ వైపు టీవీ షోలు, మరోవైపు సింగర్‌గా తన కెరీర్‌ని పరుగులు పెట్టిస్తుంది సింగర్‌ సునీత. 

PREV
18
హీరోయిన్లని మించిన అందంతో మెస్మరైజ్‌ చేస్తున్న సింగర్‌ సునీత.. చూపుతిప్పుకోవడం కష్టమే.. కిల్లింగ్‌ స్మైల్‌

సునీత లేటెస్ట్ గా తన గ్లామర్‌ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. బ్లూ శారీలో హోయలు పోతూ కనువిందు చేస్తుంది. ట్రెడిషనల్‌గానూ కనిపిస్తూనే మెస్మరైజ్‌ చేస్తుంది సునీత. కిల్లింగ్‌ స్మైల్‌తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతుంది. ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది.  అయితేశారీలో సునీతని ఇలా చూస్తుంటే హీరోయిన్లు కూడా ఈ గాయని ముందు దిగదుడుపే అని అంటున్నారు నెటిజన్లు.

28

సింగర్‌ సునీత.. గతేడాది ప్రముఖ డిజిటల్‌ సంస్థ హెడ్‌ రామ్‌ వీరపనేనిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఉన్నంతలో చాలా గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. అయితే సునీత మ్యారేజ్‌ టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. రెండో పెళ్లిని ఈ స్థాయిలో సెలబ్రేట్‌ చేసుకోడమేంటి? అంటూ చాలా మంది విమర్శలు గుప్పించారు. 

38

రెండో పెళ్లికి ఇంత హంగామా ఎందుకంటూ కామెంట్లు చేశారు. చాలా మంది చాలా రకాల కామెంట్లు చేశారు. వాటిని అంతే సున్నితంగా తిరస్కరిస్తూ, కొన్నింటికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది సునీత. వాటిని పట్టించుకోనని స్పష్టం చేసింది. తనజీవితం తన ఇష్టం అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. 
 

48

అయితే ఆమె రెండో వివాహాన్ని స్వాగతించిన చాలా మంది ప్రముఖులు ఆమెకి అభినందనలు తెలియజేశారు. సపోర్ట్ గా నిలిచారు. ఓ సందిగ్ద సమయాల్లో అండగా నిలిచి ఎంకరేజ్‌ చేశారు. అలా సునీత వ్యక్తిగత జీవితంలోనూ నిలబడింది. దీనికితోడు తన కూతురు, కుమారుడు సైతం ఎంతో ఎంకరేజ్‌ చేశారు. ఓ రకంగా వారి ప్రోత్సాహంతోనే ఆమె సెకండ్‌ మ్యారేజ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలిపింది. రామ్‌ వీరపనేనిసైతం సునీత పిల్లలను అంతే ప్రేమగా ఆహ్వానించారు. వారి కెరీర్‌ పరంగానూ అండగా నిలుస్తున్నారు. 
 

58

మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత అనేక అవమానాలు, విమర్శలు ఎదుర్కొని కుంగిపోయిన సునీత.. రెండో పెళ్లి తర్వాత తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసింది. తనకు తోడు దొరకడంతో రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతుంది. ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానెల్‌లో పాటల కార్యక్రమానికి, అలాగే ఓ కామెడీ షోకి జడ్జ్ గా చేస్తుంది సునీత. 

68

నేపథ్య గాయనీ, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతుంది. కాన్ఫిడెంట్‌గా ముందడుగు వేస్తుంది. మ్యారేజ్‌ తర్వాత సునీతలో చాలా మార్పు వచ్చింది. పూర్తిగా భిన్నమైన యాంగిల్‌ని ఆవిష్కరిస్తుంది. ఓ సరికొత్త సునీత బయటకు వచ్చిందని చెప్పొచ్చు. 

78

ఇదిలా ఉంటే తాజాగా సునీత వ్యవసాయం చేస్తుంది. తన ఫామ్‌ హౌజ్‌లో అరటి తోటలో పండ్ల గెలలు కోస్తున్న ఓ వీడియోని పంచుకుంది సునీత. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

88

టాలీవుడ్‌ సింగర్‌ సునీత.. ఫోటో షూట్లతో కుర్రాళ్లకి మతిపోయేలా చేస్తుంది. క్యూట్‌ స్మైల్‌, శారీలో యమా హాట్‌గా కనిపిస్తుంది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. 

also read: Singer Sunitha: వ్యవసాయం చేస్తున్న సింగర్ సునీత.. వీడియో వైరల్

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories