Anasuya without Makeup: అసలు రూపం చూపించిన `జబర్దస్త్` యాంకర్.. ఇది పెద్ద స్కామ్‌ అంటూ నెటిజన్ల కామెంట్‌

Published : Jan 03, 2022, 05:32 PM IST

`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ అందంపై ఎప్పుడూ చర్చ జరుగుతుంది. ఆమె దిగే ఫోటో షూట్లు వివాదాలుగా మారుతుంటాయి. ఆమె వేసుకునే డ్రెస్‌ ట్రోల్‌కి గురవుతుంది. మొత్తంగా అనసూయ ఏం చేసినా లక్షల కళ్లు తీక్షణంగా చూస్తుంటాయి. లోపాలను ఎత్తేందుకు రెడీగా ఉంటాయి.   

PREV
17
Anasuya without Makeup: అసలు రూపం చూపించిన `జబర్దస్త్` యాంకర్.. ఇది పెద్ద స్కామ్‌ అంటూ నెటిజన్ల కామెంట్‌

యాంకర్‌ అనసూయ `జబర్దస్త్` షోతో ఎంతో గుర్తింపుని తెచ్చుకుంది. ముఖ్యంగా తన హాట్‌ అందాలతో ఆడియెన్స్ ని కనువిందు చేస్తుంది. పొట్టి దుస్తుల్లో ఆమె చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ కోసమే `జబర్దస్త్` షో చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా బుల్లితెరపై అందాల విందు వడ్డిస్తున్న అనసూయ మేకప్‌పై చర్చ మొదలైంది. 
 

27

మేకప్‌లో ఎవరైనా అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా చాలా మంది హీరోయిన్లని మేకప్‌ లేకుండా చూడలేం అనేట్టుగా ఉంటారు. అలానే అనసూయ విషయంలోనూ మేకప్‌కి సంబంధించిన చర్చ జరిగింది. కానీ ఈ హాట్‌ బేబీపై మాత్రం విమర్శలు రాలేదనే చెప్పాలి. ఎందుకంటే మేకప్‌ లేకపోయినా అందంగానే ఉంటుంది అనసూయ. 

37

ఇప్పటికే పలు మార్లు మేకప్‌ లేకుండా కనిపించి ఆశ్చర్యానికి గురి చేసిన అనసూయ మరోసారి వితౌట్‌మేకప్‌ కనిపించింది. లేటెస్ట్ గా కొత్త సంవత్సరం విషెస్‌ తెలియజేస్తూ మేకప్‌ లేకుండా ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

47

ఇందులో మేకప్‌ లేకుండా అనసూయ కనిపించిన తీరుపట్ల చర్చ మొదలైంది. కొంత మంది నెటిజన్లు మేకప్‌ లేకపోయినా అందంగానే ఉన్నారు రంగమ్మత్త అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు అనసూయ అసలు రూపం ఇదే అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు ఇది పెద్ద స్కామ్‌ అంటూ పోస్ట్ లు పెట్టడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇన్నాళ్లు అనసూయ మేకప్‌లో అసలైన అందాన్ని దాస్తూ పెద్ద స్కామ్‌కి పాల్పడిందనే కోణంలో పోస్ట్ లు పెట్టడం విశేషం. ప్రస్తుతం ఈ కామెంట్లు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. 
 

57

ఏదేమైనా అనసూయ మాత్రం తాను అనుకున్నట్టుగానే ఉంటుంది. ఎంతో బోల్డ్ గానూ ఉంటుంది. తనకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తుంది. ఎవరి గురించి పట్టించుకోదు. ఎందుకంటే తనో సెలబ్రిటీ. తనపై విమర్శలు వస్తూనే ఉంటాయి. ఆమె కట్టు బొట్టు నచ్చని వాళ్లు ఏవో కామెంట్లు చేస్తుంటారు. అవన్నీ పట్టించుకుంటే అనసూయ అనే పేరు మనం వినేవాళ్లం కాదు. వాటిని దాటుకుని, విమర్శలను అంతే హుందాతనంతో స్వీకరించి ముందుకు సాగుతుందీ హాట్‌ యాంకర్‌. 
 

67

ముఖ్యంగా ఆమె దుస్తులపై చాలా విమర్శలు వచ్చాయి. వాటికి అదే స్థాయిలో రియాక్ట్ అవుతూ స్ట్రాంగ్‌  కౌంటర్‌ ఇస్తూ వస్తుంటుంది అనసూయ. ఏదైనా ఓ పరిమితి మేరకే అని, హద్దులు దాటితే కంట్రోల్‌లో పెట్టాల్సిందే అనే సూత్రాన్ని బాగా నమ్ముతుంది. అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తుంది అనసూయ. 

77

ఇటీవల `పుష్ప` చిత్రంలో దాక్షాయణి పాత్రలో ఆకట్టుకుంది అనసూయ. అంతకు ముందు `రంగస్థలం`లో రంగమ్మత్తగా పాపులారిటీని సొంతం చేసుకుంది. నటిగా సిల్వర్‌ స్క్రీన్‌పై బిగ్‌ బ్రేక్‌ని పొందింది. ఈ సినిమా ఇచ్చిన కిక్‌తో దూసుకుపోతుంది. తెలుగులో పలు భారీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తుంది అనసూయ. ప్రస్తుతం `ఆచార్య`, `భీష్మ పర్వం`, `ఖిలాడీ`, `పక్కా కమర్షియల్‌`, `రంగమార్తాండ`, `దర్జా` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో `ఫ్లాష్‌ బ్యాక్‌`, మలయాళంలో మమ్ముట్టి హీరోగా రూపొందుతున్న `భీష్మ పర్వం`లో అలైస్‌ పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర లుక్‌ ఆకట్టుకుంటుంది. ట్రెండ్‌ అవుతుంది.

aslo read: వావ్.. మెస్మరైజింగ్ థైస్ అందాలతో నిధి.. వైరల్ అవుతున్న హాట్ ఫోజులు

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories