Singer Sunitha, Pravasthi
సింగర్ ప్రవస్తి, పాడుతా తీయగా షో వివాదం బాగా ముదిరింది. పాడుతా తీయగా షోలో తనలాంటి సింగర్స్ కి అన్యాయం జరుగుతోంది అని ప్రవస్తి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. సాంగ్ సెలక్షన్, జడ్జీలు ఇచ్చే జడ్జిమెంట్, ప్రొడక్షన్ తీరు ఇలా ఏ అంశమూ కరెక్ట్ గా లేదని ప్రవస్తి ఆరోపించింది. ముఖ్యంగా ప్రవస్తి జడ్జీలుగా వ్యవహరించిన సింగర్ సునీత, కీరవాణి, చంద్రబోస్ పై తీవ్రమైన ఆరోపణలు చేసింది.
Padutha Theeyaga
నీకు 19 ఏళ్ళు, ఇంకా ముద్దు చేయాలా ?
ఈ వ్యవహారం ముదురుతుండడంతో సింగర్ సునీత, పాడుతా తీయగా షోని నిర్వహిస్తున్న జ్ఞాపిక నిర్మాణ సంస్థ నేరుగా రంగంలోకి దిగారు. సింగర్ సునీత ఎమోషనల్ గా మాట్లాడుతూ ప్రవస్తి చేసిన ప్రతి ఆరోపణకి కౌంటర్ ఇచ్చారు. ' అమ్మా ప్రవస్తి.. నిన్ను బాలుగారు, చిత్ర గారు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేసినట్లుగానే నేను కూడా నిన్ను చిన్నతనంలో ముద్దు చేశా. కానీ ఇప్పుడు నీకు 19 ఏళ్ళు. ఇప్పుడు కూడా నిన్ను ముద్దు చేస్తే బాగోదు. చిన్నప్పుడు చాలా ముద్దుగా పాడేదానివి. చిన్నప్పటిలాగే ఇప్పుడు కూడా కన్సిస్టెన్సీ మైంటైన్ చేసి ఉంటే బావుండేది.
singer pravasthi aradhya
చిన్నతనంలో మీరు మా ముందు పాటలు పాడారు. మీరు అందంగా పాడుతుంటే సంతోషంలో నేను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి ప్రవస్తి ఈరోజు పెద్దది అయిపోయి టీవీల్లో కూర్చుని మా గురించే చర్చలు పెట్టే స్థాయికి ఎదిగింది. సరైన పాట ఇవ్వలేదు అంటున్నావ్. ఒక ఛానల్ సింగింగ్ కాంపిటీషన్ లో పాటల ఎంపిక ఎలా ఉంటుందో నీకు తెలియదా ?నువ్వు ప్రతిదానికి ఇరిటేట్ అవుతావు, ప్రతిదానికి నీకు కోపం వస్తుంది. నిన్ను ఓదార్చిన సందర్భాలు చాలా ఉన్నాయి.
మీ అమ్మకి మర్యాద ఇవ్వకుండా నువ్వు అని మాట్లాడినట్లు నా గురించి చెబుతున్నావ్. కానీ నువ్వు నా ముఖం మీద చేయి పెట్టి నువ్వు మోసగత్తెవి నీవల్లే ఇదంతా అంటూ నన్ను తిట్టినప్పుడు మర్యాద గుర్తుకు రాలేదా ? వివక్ష చూపించాను అంటున్నావు.. నేను వివక్ష చూపి ఉంటే.. నీకు మాంగో మ్యూజిక్ లో పాడే అవకాశం నేను ఎందుకు ఇప్పించానో నాకు అర్థం కావడం లేదు. నా ఓటమిని చూసేందుకే సునీత అక్కడ కూర్చుంది.. అందరికీ భోజనాలు పెట్టి పార్టీ కూడా ఇచ్చింది అని అన్నావు. అమ్మా ప్రవస్తి చాలా తప్పు మాట్లాడవు.
ఎవరో ఓడిపోతేనో, ఎవరైనా ఎలిమినేట్ అయితేనే సంతోషించేంత నీఛమైన క్యారెక్టర్ నాది కాదు అమ్మా. ఈ విషయం నీ వల్ల ఈ రోజు చెప్పుకోవాల్సి వస్తోంది. నీలో ఉన్న భయాల కారణంగా ఏం చెప్పినా అది నీ గురించే అని ఇంత రచ్చ చేస్తున్నావ్. ఇవ్వన్నీ పక్కన పెట్టి సింగర్ గా ఎదుగుతావని ఆశిస్తున్నా అంటూ సునీత ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
Pravasthi Controversy
జ్ఞాపిక సంస్థ నిర్మాత ప్రవీణ కడియాల కౌంటర్
ప్రవస్తి ఆరోపణలపై జ్ఞాపిక సంస్థ నిర్మాత కూడా స్పందించారు. ప్రవీణ కడియాల మాట్లాడుతూ.. వాళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్స్ కి మంచి పాటలు ఇచ్చారు. నాకు మాత్రం బాగాలేని సాంగ్స్, నేను పాడలేని సాంగ్స్ ఇచ్చారు అని ప్రవస్తి మాట్లాడారు. ఒక ఛానల్ లో సాంగ్ ఎంపిక అనేది ఆ ఛానల్ మ్యూజిక్ రైట్స్ ని బట్టి ఉంటుంది. ప్రతి వారం ఒక్కో జోనర్ లో సింగింగ్ కాంపిటీషన్ ఉంటుంది. ఎంపిక చేసిన జోనర్ లో ఆ ఛానల్ వద్ద మ్యూజిక్ రైట్స్ ఉన్న పాటలని మాత్రమే ఎంచుకోవాలి. ఇందులో మేము ఎక్కడా వివక్ష చూపే ప్రసక్తే లేదు.
కొన్ని కాస్ట్యూమ్స్ బలవంతంగా వేసుకోమని చెప్పారు అంటూ ప్రవస్తి గారు ఆరోపించారు. ఆ రోజు ఆ కంటెస్టెంట్ ఎలాంటి పాట పాడబోతున్నారు అనే దానిని బట్టి వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎంపిక చేస్తాం. కాస్ట్యూమ్ ఎంపిక చేసేది కేవలం పాటని బట్టి మాత్రమే. ఎవరి బలవంతం ఉండదు. ప్రవస్తికి ఒక్కసారి కూడా పొట్టి బట్టలు ఇవ్వలేదు. పాడుతా తీయగా చరిత్రలో కనీసం స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేసుకోమని మేము చెప్పలేదు అని ప్రవీణ తెలిపారు.