అక్షయ్ కుమార్ నటించిన `కేసరి చాప్టర్ 2` బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో, సినిమా నాలుగో రోజు వసూళ్ల గణాంకాలు వెలువడ్డాయి. చాలా ఏళ్లుగా స్ట్రగుల్ అవుతున్న అక్షయ్ ఇప్పుడు తన జోరు చూపిస్తున్నారు. సరైన సినిమా పడితే ఆయన రేంజ్ ఎలా ఉంటుందో ఇందులో చూపించారు.
అక్షయ్ కుమార్ నటించిన `కేసరి చాప్టర్ 2` విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో, సినిమా నాలుగో రోజు వసూళ్ల గణాంకాలు వెలువడ్డాయి. కేసరి 2 సోమవారం పరీక్షలో పాసైందా? ఫెయిల్ అయ్యిందా తెలుసుకుందాం…
28
కేసరి 2 జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఆధారంగా
అక్షయ్ కుమార్ నటించిన `కేసరి 2` ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఆధారంగా రూపొందింది, దీని వాస్తవికతను సి. శంకరన్ నాయర్ వెలుగులోకి తెచ్చారు.
38
అక్షయ్ కుమార్ సి. శంకరన్ నాయర్ పాత్రలో
`కేసరి 2` సినిమాలో అక్షయ్ కుమార్ సి. శంకరన్ నాయర్ పాత్ర పోషించారు. ఆయన పాత్రకు ప్రశంసలు కురుస్తున్నాయి. దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించారు. దీంతో ఆడియెన్స్ కి అది బాగా కనెక్ట్ అయ్యింది.
48
కేసరి 2 నాలుగో రోజు వసూళ్లు తగ్గాయి
`కేసరి 2` సినిమా నాలుగో రోజు వసూళ్ల గురించి చెప్పాలంటే, సోమవారం దాని వసూళ్లలో తగ్గుదల కనిపించింది. sacnilk.com ప్రకారం, సినిమా నాలుగో రోజు 4.50 కోట్లు వసూలు చేసింది.
58
కేసరి 2 ఇప్పటివరకు 34 కోట్లు వసూలు
`కేసరి 2` సినిమా ఇప్పటివరకు భారతీయ బాక్సాఫీస్ వద్ద 34 కోట్లు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ 150 కోట్లు. బడ్జెట్ పరంగా చూస్తే ఇది తక్కువగానే ఉన్నా, చూడబోతుంటే నెమ్మదిగా పుంజుకుంటున్నట్టు కనిపిస్తుంది.
68
కేసరి 2 ప్రారంభ రోజు వసూళ్లు
`కేసరి చాప్టర్ 2` ఓపెనింగ్ రోజు 7.75 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు 9.75 కోట్లు, మూడో రోజు 12 కోట్ల వ్యాపారం చేసింది. నెమ్మదిగా పుంజుకోవడం విశేషం. అయితే సోమవారం కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. మంగళవారం కూడా ఇంకాస్త బాగానే ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
78
కేసరి 2 జలియన్ వాలాబాగ్ కథ
కేసరి 2 సినిమాలో అక్షయ్ కుమార్‌తో పాటు ఆర్. మాధవన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు పోరాడిన సి. శంకరన్ నాయర్ ఆధారంగా ఈ సినిమా కథ రూపొందింది.
88
అక్షయ్ కుమార్ కేసరి 2పై ఆశలు
అక్షయ్ కుమార్ వరుసగా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నారు. `కేసరి 2`పై ఆయనకు చాలా ఆశలున్నాయి. ఈ ఏడాది విడుదలైన ఆయన సినిమా `స్కై ఫోర్స్` కూడా పర్వాలేదనిపించింది. అయితే అక్షయ్ కమ్ బాక్ అనే మూవీ పడలేదు. మరి ఆ లోటుని `కేసరి 2` తీరుస్తుందా అనేది చూడాలి.