సింగర్ బాలుతో సునీతకు విడదీయరాని అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి పాడుతా తీయగా షో ఏళ్ల తరబడి చేశారు. విదేశాల్లో పదుల సంఖ్యలో మ్యూజిక్ లైవ్ షోలు ఇచ్చారు. బాల సుబ్రహ్మణ్యం టీమ్ లో కచ్చితంగా సునీత ఉండేవారు. ఆయనతో కలిసి వందల పాటలు సునీత పాడారు. ప్రొఫెషన్ కి మించి కుటుంబ సభ్యులు మాదిరి సునీత, ఎస్పీ బాలు మెలిగేవారు. బాలును సునీత మామయ్య అని పిలిచేవారట.