పింక్ చుడీదార్ లో ప్రియా వారియర్ మెరుపులు.. ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న మలయాళీ బ్యూటీ

First Published | Jun 4, 2023, 3:58 PM IST

యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ నెట్టింట నయా లుక్స్ తో అదరగొడుతోంది. తాజాగా ట్రెడిషనల్ వేర్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ లుక్ లో మంత్రముగ్ధులను చేసింది. 
 

కన్నుగీటు వీడియోతో యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier)  ఓవర్ నైట్ లో స్టార్ డమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. దాంతో మలయాళం, తెలుగు, హిందీలో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ వస్తోంది. 
 

తెలుగులో ప్రియా వారియర్ ‘చెక్’, ‘ఇష్క్ : ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ’ చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలు పెద్దగా అనుకుంత సక్సెస్ ను అందించలేకపోయాయి. దీంతో ఇతర భాషల్లో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. 
 


ఇదిలా ఉంటే.. మలయాళీ భామ ప్రియా వారియర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తున్న విషయం తెలిసిందే. వరుసగా టూర్లు, వేకేషన్లకు వెళ్తూ రచ్చ చేస్తోంది. తన వెకేషన్ నుంచి స్టన్నింగ్ ఫొటోలను షేర్ చేసి మతులు పోగొట్టింది. 
 

వెకేషన్ పూర్తి చేసుకున్నఈ ముద్దుగుమ్మ  తాజాగా బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. పింక్ చుడీదార్ లో చూపు తిప్పుకోకుండా చేసింది. సంప్రదాయ దుస్తుల్లో ప్రియా మరింత అందాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు అదిరిపోయే ఫోజులతోనూ ఆకట్టుకుంది.

క్యూట్ స్మైల్, గుచ్చే చూపులతో ప్రియా వారియర్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. యంగ్ బ్యూటీ నయా లుక్ కు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా లైక్స్,, కామెంట్లతో ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. కుర్ర భామను మరింత ఎంకరేజ్ చేస్తున్నారు. 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ చిత్రంలో నటించిందని టాక్. ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఇదే నిజమైతే ఈ ముద్దుగుమ్మ పంట పండినట్లే అంటున్నారు. మరోవైపు మలయాళం, తమిళంలోనూ సినిమాలు చేస్తోంది.

Latest Videos

click me!