సెమీస్ లో ఓడినా సింధు కు మెడల్, సింగర్ సునీత సంచలన కామెంట్స్

First Published Aug 2, 2021, 4:23 PM IST

ఒలింపిక్స్ లో భారత్ స్థానం ఎప్పుడూ వెనుకే. కనీస ఆర్థిక వ్యవస్థలేని దేశాలతో కూడా పోటీ పడలేని పరిస్థితి ఇండియాలో ఉంది. . 140కోట్ల జనాభా గల భారత దేశం ఒలంపిక్స్ లో ఒక గోల్డ్ కొడితే పెద్ద హిస్టరీ. కనీసం మెడల్ కొడితే చాలు వాళ్ళ జీవితమే మారిపోతుంది.

ఆఫ్రికన్, అరబ్ దేశాల్లో క్రీడాకులు ఒలింపిక్స్ లో సత్తా చాటుతూ ఉంటారు. వాళ్లకు కనీస ప్రోత్సహకాలు కూడా ఉండవు. మన దేశంలో కనీసం  బ్రాంజ్ మెడల్ కొడితే చాలు వాళ్ళ కెరీర్ సెటిల్ అయినట్లే.
undefined
ఆ విషయాలు పక్కనపెయితే సెమీస్ లో ఓడినా కూడా బ్యాట్మింటన్ క్రీడాకారిణి సింధు ఒలింపిక్స్ లో పతకం దక్కించుకున్నారు. సెమీస్ లో ఓడిన సింధుకు మూడవ ప్రైజ్ బ్రాంజ్ మెడల్ దక్కింది. ఐతే ఇది ఒక రికార్డు.
undefined
గత ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ కొట్టిన సింధు... ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ దక్కించుకుంది. భారత్ తరపున రెండు ఒలింపిక్స్ దక్కించుకున్న మహిళా క్రీడాకారిణిగా సింధు రికార్డులకు ఎక్కారు.
undefined
టోక్యో ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన సింధు పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సింగర్ సునీత తనదైన శైలిలో స్పందించారు. ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో సింధు విజయం పై కామెంట్ చేశారు.
undefined
సింధు నీవు దేశాన్ని గర్వంగా ఫీల్ అయ్యేలా చేశావు అంటూ సింగర్ సునీత కామెంట్ చేయడం జరిగింది. తెలుగు అమ్మాయి అయిన సింధు భారత్ కి మెడల్ అందించడం... సునీత గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు.
undefined
సునీత పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక జనవరిలో రెండో వివాహం చేసుకున్న సునీత హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నారు.

Tokyo Olympics-PV sindu

ముఖ్యంగా ఆమె బుల్లితెరపై బిజీ అయ్యారు.  జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రామ్ లో సునీత జడ్జిగా ఉన్నారు. అలాగే పాడుతా తీయగా లేటెస్ట్ సీజన్ కి ఆమె జడ్జిగా వ్యవహరించనున్నారు.
undefined
click me!