పెళ్లి గురించి మా ఫ్యామిలీకి లేని బాధ మీకెందుకు .. మా పర్సనల్‌ లైఫ్‌ అవసరం లేదు.. నటి గీతా సింగ్‌ ఎమోషనల్‌

Published : Aug 02, 2021, 03:45 PM IST

`కితకితలు` ఫేమ్‌, కమెడీయన్‌ గీతా సింగ్‌ ఎమోషనల్‌ అయ్యింది. యాంకర్‌ సుమ షోలో తన బాడీ షేమింగ్‌పై, తన మ్యారేజ్‌పై వచ్చే కామెంట్లు, ట్రోల్స్  గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యింది. ఇప్పుడిది వైరల్‌ అవుతుంది.

PREV
19
పెళ్లి గురించి మా ఫ్యామిలీకి లేని బాధ మీకెందుకు .. మా పర్సనల్‌ లైఫ్‌ అవసరం లేదు.. నటి గీతా సింగ్‌ ఎమోషనల్‌
అల్లరి నరేష్‌ సరసన `కితకితలు` చిత్రంలో నటించి పాపులర్‌ అయిన గీతా సింగ్‌ గత కొన్ని రోజులుగా సినిమాలు లేక ఇబ్బందిపడుతుంది. చివరగా ఆమె `తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్‌`, `బుర్రకథ` వంటి చిత్రాల్లో నటించింది.కానీ ఇప్పటికీ అవకాశాల కోసం స్ట్రగుల్‌ తప్పడం లేదట.

29
ఈ క్రమంలో ఆమె తాజాగా సుమ కనకాల యాంకర్‌గా చేసే `క్యాష్‌` ప్రోగ్రామ్‌`లో పాల్గొంది. ఇందులో ఒకప్పుడు తమదైన కామెడీతో ఓ ఊపు ఊపిన సునీల్‌శెట్టి, హీరో బాలాదిత్య, అంబటి శ్రీనివాస్‌ సందడి చేశారు. వీళ్లంతా ఇప్పుడు యాక్టీవ్‌గా లేరు. అంటే వీరికి ఆఫర్లు రావడం లేదనే చెప్పొచ్చు.

39
దీంతో సుమ మరోసారి వీరిని గుర్తు చేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా ఈ షోలో వీరంతా తమదైన కామెడీతో నవ్వులు పూయించారు. మరోవైపు ఎప్పటిలాగే సుమ కూడా వీరిని ఓ ఆట ఆడుకున్నారు.

49
అయితే గీతా సింగ్‌ విషయానికి వచ్చేసరికి అందరి గుండె బరువెక్కింది. ఆమె ఇటీవల బాధపడిన విషయాన్ని సుమతో పంచుకుంది. `ఏంటీ ఈ మధ్య బాగా బాధపడ్డారట అని సుమ అడగడంతో గీతా సింగ్‌ ఎమోషనల్‌ అయ్యింది.

59
తన బాడీ షేమింగ్‌పై బయట కొన్ని కామెంట్లు వస్తున్నాయని తెలిపింది. పర్సనల్‌ విషయాలు కూడా అడుగుతున్నారని,ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని చాలా మంది నుంచి ఈ ప్రశ్నలు ఎదురవుతున్నాయని తెలిపింది. తాను సంతోషంగా ఉన్నానని, తన ఇంట్లో వాళ్లు హ్యాపీగా ఉన్నారు మధ్యలో నీకేంటి ప్రాబ్లెమ్‌ అని తెలిపింది గీతా సింగ్‌.

69
కావాలని కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారని, ట్రోల్స్ చేస్తున్నారని, బయట కూడా చాలా మంది ఈ విషయాలే అడుగుతున్నారని వాపోయింది. ఇవన్నీ చాలా బాధకి గురి చేస్తాయని పేర్కొంది.

79
మేం తెరమీదే కావాలి మీకు.. మా పర్సనల్స్ మీకు అవసరం లేదని ఘాటుగా కౌంటర్‌ ఇచ్చింది. ఈ సందర్బంగా సుమతో అనేక విషయాలను పంచుకుంది గీతా సింగ్‌. ఈ ఎపిసోడ్‌లో ఇది హైలైట్‌గా ఉండబోతుందని చెప్పొచ్చు.

89
`కితకితలు`తో పాపులర్‌ అయిన గీతా సింగ్‌ కమెడీయన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేసింది. వాటిలో `వీడు తేడా`, `సీమశాస్త్రి` `తాళి కడితే 90కోట్లు` చిత్రాల్లో లీడ్‌ రోల్స్ చేసింది. `జంప్‌ జిలానీ`, `కెవ్వు కేక`, `ఎవడి గోల వాడిది`, `టామి` వంటి చిత్రాలతో నటిగా రాణించింది. కానీ ఇప్పుడు అవకాశాల విషయంలో ఇబ్బంది పడుతుందట.

99
తాను లావుగా ఉండటం వల్ల నేటితరం మేకర్స్ పట్టించుకోవడం లేదని, ఆఫీసులకు వెళ్లి అడిగినా మళ్లీ రండి అని చెబుతున్నారని, చాలా చులకనగా చూస్తున్నారని గతంలో ఓ సందర్భంలో వాపోయింది గీతా సింగ్‌. ఆ మధ్య ఓ దర్శకుడు దారుణంగా అవమానించాడని, ఇన్ని సినిమాలు చేసిన తనని ఆడిషన్‌ చేస్తానని చెప్పాడని, దీంతో అవమానంతో సైలెంట్‌గా వెళ్లిపోయానని తెలిపింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories