ఇటీవల మనోజ్.. భూమా మౌనికతో కలసి గణేష్ పూజలో కనిపించాడు. భూమా మౌనిక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి కావడంతో ఈ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ అండ్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలం నుంచి మనోజ్, మౌనిక రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల కుమార్తె భూమా మౌనిక. భూమా మౌనిక సోదరు అభిలప్రియ కూడా రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే.