బిగ్ బాస్ రియాలిటీ షో హిందీ తర్వాత తెలుగులో ప్రారంభమైన విషయం తెలిసిందే. పాపులర్ రియాలిటీ షోగా రన్ అవుతుంది. దీనికి మంచి ఆదరణ దక్కుతుంది. తొలి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా, రెండో సీజన్‌కి నాని, మూడు నాలుగు, ఐడు, ఆరు సీజన్లకి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. ఆ మధ్య ఓటీటీలోనూ షో రన్ అయ్యింది. అందులో బిందుమాధవి విన్నర్ అయ్యారు. మొదటి సీజన్‌లో శివబాలాజీ, రెండో సీజన్‌లో కౌశల్, మూడో సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్, నాల్గో సీజన్‌లో అభిజిత్,ఐదో సీజన్‌లో సన్నీ విన్నర్ అయ్యారు.