సింగర్ ప్రవస్తి ఆరోపణలతో పాడుతా తీయగా షోలో మొదలైన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సింగర్ ప్రవస్తి ఆరోపణలపై సునీత స్పందించి, ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆతరువాత సునీత కామెంట్స్ పై కూడా ప్రవస్తి స్పందించారు. సింగర్ సునీత ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో సింగర్ ప్రవస్తిని తానే చాలాసార్లు కాపాడానని, ఆమె కోపం, చిరాకును భరించి అవకాశాలు ఇచ్చామన్నారు. చిన్నతనంలో నిన్ను బాలు, చిత్రగారితో పాటు తాను కూడా ఒళ్లో పెట్టుకుని ముద్దు చేశానని.. కానీ ఆమె తనపై డిబేట్ చేసే స్థాయికి వెళ్లిందంటూ ప్రసస్తి ఆరోపణల్ని ఖండించారు సునీత.
అయితే సునీత వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మరో వీడియో రిలీజ్ చేయడంతో పాటు, ప్రవస్తి తన తల్లితో కలిసి ఓ డిబెట్ లో పాల్గొన్నారు. సునీతకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వీడియోలో సునీత చెప్పినవన్నీ అబద్దాలే అన్నారు. అక్కడ చుట్టు కెమెరాలు ఉన్నాయి కదా. వాటి వీడియోలు కట్ చేయకుండా బయటపెడితే నిజాలు బయటపడతాయి అన్నారు.
సునీత గారూ.. మీరు చాలా విషయాలు మాట్లాడారు. నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను.. ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దు చేశాను.. అలాగని ఇప్పుడు చేయలేం కదా అని అన్నారు. నేను మిమ్మల్ని ఒళ్లో కూర్చోబెట్టుకోమని అడగడం లేదు మేడమ్.. ఒక మనిషికి నాకు రెస్పెక్ట్ ఇవ్వమన్నాను. ఒక సింగర్‌గా నేను ఆ రెస్పెక్ట్ కోరుకున్నాను అన్నారు.
singer pravasthi aradhya (RTV)
తనకు ప్రతీ విషయంలో అన్యాయం జరిగింది అన్నారు ప్రవస్తి. ఇక ప్రవస్తీ అమ్మగారు మాట్లాడుతూ.. తాను చాలా పాటలు సెలక్ట్ చేసింది.. కాని ఏ పాటను వాళ్లు ఒప్పుకోలేదు. ఇక నాకు వద్దు అనేలా టర్చర్ చేశారు. ప్రవస్తి అంత అద్భుతంగా పాట పాడినా.. సునిత, చంద్రబోస్ సైగ చేసుకుని మరీ అన్యాయం చేశారు. ప్రవస్తి కంటే దారుణంగా పాడిన వారికి పైకి లేచి మరీ చప్పట్లు కొట్టారు. లిరిక్స్ తప్పు పాడినవారిని కూడా అద్భుతం అని పొగిడారు, మరి ఓ డ్యూయోట్ ను అంత అద్భుతంగా పాడిన ప్రవస్తీని మాత్రం ఎలాగైనా ఎలిమినేట్ చేయాలని అనుకున్నారు అని అన్నారు.
Singer Sunitha, Pravasthi
అంతే కాదు సునీత పాడిన పాట, చంద్రబోస్ రాసిన పాటలు కాని, కీరవాణికి సబంధించిన పాటలు పాడితే వెంటనే పైకి లేచి చప్పట్లు కొడతారు, ఆ పాట బాగా పాడినా పాడకపోయినా అద్భుతం అంటారు. కాని నా విషయంలో నే ఎందుకు ఇలా చేుస్తున్నారు సునిత గారు అని ప్రవస్తి ప్రశ్నించారు. ఫెయిల్యూర్స్ ను హుందాగా తీసుకోవాలి అని సునిత గారు అంటున్నారు. గతంలో నేను చాలా ఫేయిల్యూర్స్ చూశాను వారి విషయంలో నేనేం మాట్లాడలేదు.. కాని ఇక్కడ తేడా జరిగింది కాబట్టే నేను స్పందించాల్సి వచ్చింది అన్నారు.
singer pravasthi aradhya
నేను అడిగింది ఏంటంటే.. లిరిక్స్ మర్చిపోయిన వాళ్లు.. సరిగా పాడలేని వాళ్లు ఎందుకు టాప్‌లో ఉన్నారని. లిరిక్స్ మర్చిపోయినా తప్పు కాదు.. చేతి మీద రాసుకుని వచ్చి పాడుతుంటే దాన్ని కామెడీగా మార్చేశారు. అప్పుడు అది కాంపిటేషన్ అని గుర్తురాలేదు. కానీ చివరికి వాళ్లకే ఎక్కువ మార్కులేశాడు. ఇది కాదా పక్షపాతం చూపించడం అంటే. నేను చిన్నప్పుడు ఎలా పాడేదాన్నో.. ఇప్పుడు అలా పాడటం లేదని అన్నారు. అది మీ ఒపీనియర్. దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తున్నా అన్నారు ప్రవస్తి.
Padutha Theeyaga
అయితే సునీత సాంగ్ సెలక్షన్ గురించి కూడా మాట్లాడారు. వీడియో రైట్స్ గురించి కూడా మాట్లాడారు. ఇవిగో చూడండి.. రైట్స్ ఉన్నాయో లేదో. మాకు దేనికైతే వీడియో రైట్స్ ఉన్నాయో.. ఆ సాంగ్స్ మాత్రమే ఎంచుకున్నాం. అందులో నుంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకుని ఇచ్చాం. కాబట్టి మీరు చెప్పినట్టుగా నా సాంగ్స్ రిజెక్ట్ చేయడానికి కారణం వీడియో రైట్స్ కాదు. దేని గురించో కూడా చెప్తాను. రాఘవేంద్రరావుగారి స్పెషల్ ఎపిసోడ్‌లో భాగంగా.. ఆయన సినిమాల్లోని భక్తి పాటల్లో నేను సాంగ్ సెలెక్ట్ చేసుకుని ప్రొడక్షన్ వాళ్లకి పంపిస్తే.. ఇది ఇవ్వడం కుదరదని చెప్పారు. కానీ.. వేరే కంటెస్టెంట్‌తో అదే సాంగ్ పాడించారు. ఆమె లిరిక్స్ మర్చిపోయినా కూడా మంచి కామెంట్స్ ఇచ్చారు. మీరు సైగలు చేసి మరీ పాడించారు. మరి ఇది పక్షపాతం చూపించడం కాదా మేడమ్ అని ప్రవస్తి ప్రశ్నించారు.