Asha Bhosle last Wish: ఆశా భోస్లే చివరి కోరిక ఇదే.. లెజెండరీ సింగర్‌ లాస్ట్ విష్‌ నెరవేరిందా?

Published : Apr 13, 2026, 12:02 PM IST

Asha Bhosle last Wish: సుమారు 12,000కు పైగా పాటలకు తన గాత్రాన్ని అందించిన ఆశా భోస్లేకు దాదాసాహెబ్ ఫాల్కేతో సహా వందలాది గౌరవాలు దక్కాయి. అయితే ఆమెకి ఒక చివరి కోరిక ఉంది. మరి అది తీరిందా?

PREV
14
భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది

ప్రముఖ లెజెండరీ ప్లేబ్యాక్‌ సింగ్‌ ఆశా భోస్లే కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ దిగ్గజ గాయని ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మృతితో భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. భారతీయ సంగీతం మూగబోయింది. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. తన మధురమైన స్వరంతో దశాబ్దాలుగా సంగీత ప్రియులను ఆశా భోస్లే అలరించిన విషయం తెలిసిందే. 

24
ఆశా భోస్లే చివరి కోరిక!

ఆశా భోస్లేకి ఒక చివరి కోరిక ఉంది. సంగీతమే తన ప్రాణమని, చివరి క్షణంలో కూడా పాడుతూనే ఈ లోకాన్ని విడిచిపెట్టాలని ఆమె ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు. పాడుతూనే కన్నుమూయాలని ఆమె వెల్లడించింది.

34
అర్జున్ టెండూల్కర్ పెళ్లే చివరి సంగీత ప్రదర్శన

అయితే ఆశా భోస్లే చివరి కోరిక నెరవేరిందా? అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఆమె ఇటీవల మాజీ టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకలో పాట పాడారు. అదే ఆమె చివరి పాట. కానీ ఇదే ఆమె చివరి బహిరంగ ప్రదర్శన అవుతుందని ఎవరూ ఊహించలేదు.

44
ఆశా భోస్లే అద్భుత ప్రస్థానం.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సహా ఎన్నో గౌరవాలు అందుకున్న ఆశా, హిందీతో పాటు అనేక భారతీయ, విదేశీ భాషలలో తన గాన మాధుర్యాన్ని పంచారు. తన కెరీర్‌లో 12000 లకుపైగా పాటలను ఆలపించారు. తెలుగులోనూ వేల పాటలని ఆలపించారు.  ఆశా భోస్లే భౌతికంగా దూరమైనా, ఆమె పాడిన వేలాది పాటల రూపంలో సంగీత ప్రియుల హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. ఆమె స్వరానికి మరణం లేదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories