రచన: దేవి శ్రీ ప్రసాద్ / రామజోగయ్య శాస్త్రి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గానం: రఘు దీక్షిత్
లిరిక్స్:
రాజ్యం గెలిచినోడే రాజవుతాడు.. రాజ్యం విడిచినోడే రామచంద్రుడు..
యుద్ధం గెలిచేటోడు వీరుడు శూరుడు.. యుద్ధం విడిచేటోడే దేవుడు!!
చల్ చలో చలో.. లైఫ్ సే మిలో.. ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో!
చల్ చలో చలో.. చలించు దారిలో.. ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో!
కన్నీళ్లెందుకు ఉప్పగుంటాయి? తియ్యగుంటే కడదాకా వదలవు గనుక..
కష్టాలెందుకు బరువుగుంటాయి? తేలికైతే బ్రతుకంతా మోస్తావు దించవు గనుక!
బెదురే లేని నీకు కాక.. ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక?
చూద్దాం అంటూ నీ తడాఖా.. వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటి గడప దాకా!
పడ్డవాడే.. కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోడూ..
ఒక్కడైనా కానరాడే.. జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు!!
మడత నలగని షర్టు లాగా అల్మారాలో పడి ఉంటే అర్థం లేదు..
గీత తగలని కాగితంలా వట్టి చెదలు పట్టి పోతే ఫలితం లేనే లేదు!
పుడుతూనే గుక్క పెట్టినగాక.. కష్టమన్న మాటేం కొత్తం కాదు..
కొమ్మల్లో పడి చిక్కుకోక.. ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు!
ప్లస్ కాదు మైనస్ కాదు అనుభవాలే ఏదైనా..
ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా నీదైన గెలుపు దారిలోనా!!