భర్తతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేసిన సిమ్రాన్.. ఆ విషయంలో మాత్రం జాగ్రత్త పడింది..

Published : May 28, 2022, 11:26 AM IST

సీనియర్ నటి సిమ్రాన్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. గ్లామర్ హీరోయిన్ గా సౌత్ ఆడియెన్స్ ను ఊర్రూతలూగించిన సిమ్రాన్ బిజినెస్ కూడా ప్రారంభించింది.  

PREV
17
భర్తతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేసిన సిమ్రాన్.. ఆ విషయంలో మాత్రం జాగ్రత్త పడింది..

నార్త్ బ్యూటీ సిమ్రాన్ 1999 నుంచి 2004 వరకు తమిళ ఇండస్ట్రీలో హవా కొనసాగింది. టాప్ హీరోయిన్ గా తన మార్క్ చూపించింది. ఎన్నో చిత్రాల్లో విభిన్న పాత్రలో నటించి సౌత్ ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. 
 

27

అలాగే తెలుగులోనూ టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించి తెలుగు హీరోయిన్ గానూ వెలుగొందింది. తెలుగులో ‘సమరసింహా రెడ్డి’, ‘కలిసుందాం రా’, ‘సీతయ్య’, ‘ఒక్క మగాడు’ వంటి చిత్రాలు సిమ్రాన్ కు మరింత గుర్తింపును తెచ్చిపెట్టాయి. తెలుగులో చివరిగా ‘లీలా’అనే మూవీలో నటించింది.
 

37

స్టార్ హీరోయిన్ గా, సీరియల్ యాక్టర్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రల్లో నటించి ప్రేక్షకకులను అలరించింది. ఒకానోక దశలో విలన్ పాత్రను కూడా పోషించేందుకు వెనకడుగు వేయలేదు. కథ నచ్చితే ఏ స్థాయి సినిమాలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉండేది. అలాగే గ్లామర్ ఒలకబోస్తూ పలు చిత్రాల్లో స్పెషల్ అపియరెన్స్ కూడా ఇచ్చింది.
 

47

2003లో తన స్నేహితుడైన దీపక్ బగ్గాను వివాహాం చేసేుకుంది. అప్పటి నుంచి కాస్తా సినిమాల జోరు తగ్గించింది. కానీ దూరంగా మాత్రం ఉండలేకపోయింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లోనూ పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తూ తన మార్క్ చూపిస్తోంది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ సిమ్రాన్ వరుస చిత్రాల్లో నటిస్తోంది.
 

57

అయితే నటిగా తాను మంచి సక్సెస్ ను చూసింది. దీంతో ఆమె ఫోకస్ ప్రస్తుతం బిజినెస్ వైపు  మళ్లీంది. ఇందుకు తన భర్త దీపక్ బగ్గాతో కలిసి సొంతం వ్యాప్తం స్టార్ట్ చేసింది. సిమ్రాన్ అండ్ సన్స్ అనే బ్రాండ్ తో ప్రొడక్షన్ స్టూడియోస్ ప్రారంభించింది. 

67

ఈ సంస్థ నిర్వహణ బాధ్యతలను మాత్రం తన భర్తకు అప్పజెప్పింది. ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. బిజినెస్ పేరిట అదనపు బాధ్యతలు స్వీకరించి తన కేరీర్ కు ఇబ్బంది కలిగించే తప్పు మాత్రం చేయలేదంటూ పలువు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అటు వ్యాపారంతో పాటు.. ఇటు సినిమాల్లోనూ దూసుకెళ్తోంది సిమ్రాన్.
 

77

ప్రస్తుతం తమిళంలో ఐదారు చిత్రాల్లో నటిస్తూ బిజియేస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది. ఇటీవల తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సరసన ‘మహాన్’మూవీలో నటించి ఆకట్టుకుంది. ఈ మూవీ ఆడియెన్స్ నోట పర్లేదనిపించుకుంది. ‘రాకెట్రీ, అందగన్, క్యాప్టెన్, ధ్రువ నక్షత్రం, వనంగముడి’ చిత్రాల్లో నటిస్తోంది. హిందీలోనూ ‘గుల్మోహర్’లో కనిపించనుంది.
 

click me!

Recommended Stories