‘దేవర’లో హీరోయిన్ ఎంట్రీ పై షాకింగ్ న్యూస్, నిజమైతే పెద్ద టాస్కే

First Published | Sep 23, 2024, 8:57 AM IST

 స్టార్ కిడ్ గా సినిమాల్లోకి ఎంట్రీఇచ్చి గ్లామర్ హీరోయిన్ అనిపిస్తూనే స్టార్ హీరోయిన్ స్టేటస్ కొట్టెయ్యాల్సిన జాన్వి బాలీవుడ్ లో సాలిడ్ హిట్ ఇప్పటి వరకూ కొట్టనేలేదు. 

devara part 1


 ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర (Devara).స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఎక్సపెక్టేషన్స్  ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు  ట్రైలర్స్  ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసింది.

ఈ క్రమంలో  ఈ సినిమా నుంచి రాబోయే ప్రతి అప్డేట్ పై ఫ్యాన్స్ తమ ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా దేవర  సినిమాపై క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది.అది హీరోయిన్ ఎంట్రీ గురించి కావటం విశేషం. 


ఈ సినిమా ద్వారా  తెలుగులోకి స్ట్రైయిట్ గా జాన్వికపూర్ హీరోయిన్ గా  ఎంట్రీ ఇస్తోంది. ఆమె సినిమాల్లోకి వచ్చి ఆరేళ్లవుతుంది. ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క కమర్షియల్ హిట్ కొట్టలేకపోయింది జాన్వీ. రకరకాల జానర్స్ ట్రై చేస్తున్నా కమర్షియల్ సక్సెస్ రాబట్టలేకపోయింది. స్టార్ కిడ్ గా సినిమాల్లోకి ఎంట్రీఇచ్చి గ్లామర్ హీరోయిన్ అనిపిస్తూనే స్టార్ హీరోయిన్ స్టేటస్ కొట్టెయ్యాల్సిన జాన్వి బాలీవుడ్ లో సాలిడ్ హిట్ ఇప్పటి వరకూ కొట్టనేలేదు. దాంతో ఆమె దృష్టి మొత్తం తెలుగు పరిశ్రమపైనే ఉంది.
 



ఎన్టీఆర్, జాన్వికపూర్ జంటగా తెరకెక్కుతున్న దేవర నుంచి రిలీజైన రొమాంటిక్ సాంగ్ పెద్ద హిట్టవటంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది జాన్వి. దాంతో ఈ సాంగ్ ని సోషల్ మీడియాలో గట్టిగా ప్రమోట్ చేసుకుంటోంది జాన్వి. బాలీవుడ్ PR మీడియా అంతా ఈ సాంగ్ ని, జాన్వీని పొగుడుతూ ప్రమోట్ చేస్తున్నారు.

జాన్వీ కెరీర్ లో ఇదే మొదటి రొమాంటిక్ కమర్షియల్ సాంగ్ కావడం గమనార్హం. జాన్వి దేవరకు సంబందించి ప్రతి చిన్న విషయాన్ని ఎగ్జైట్మెంట్ తో పోస్ట్ చేస్తోంది. దేవర సాంగ్ లో జాన్వి, ఎన్టీఆర్ జంట కెమిస్ట్రీ గురించి ఇప్పటికే హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది టాలీవుడ్ లో.


అయితే సినిమాలో జాన్వీ కపూర్ కనపడేది సెకండాఫ్ లోనే అని తెలుస్తోంది.  ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు రివీల్ చేసారు. జాన్వీ ఫస్టాఫ్ లో కనపడదని, సెకండాఫ్ లోనే ఎంట్రీ ఇస్తుందని అన్నారు.  దాంతో ఇదేమి కొత్త ట్విస్ట్ అంటున్నారు అభిమానులు.

దాదాపు మూడు గంటలు పాటు సాగే ఈ సినిమాలో హీరోయిన్ లేకుండా గంటన్నర సినిమా సాగాలంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి, హీరోయిన్ ని మించిన సర్పైజ్ లు ఉంటేనే వర్కవుట్ అవుతుందని అంటున్నారు. అందుతున్న సమాచారం మేరకు సెకండాఫ్ లో ఎక్కువ భాగం వర (ఎన్టీఆర్ పాత్ర), తంగం(జాన్వీ) చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. అయితే అసలు నిజం ఏమిటి , కొరటాల ఎలా ప్లాన్ చేసారు అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 


 ఇక 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈమె కూడా సిద్ధమైంది. నీలం రంగు చీరలో అందాలన్నీ కనిపించేలా ముస్తాబైంది. కానీ ఈవెంట్ కాస్త రద్దవడంతో అభిమానుల గురించి ఓ వీడియో పోస్ట్ చేసింది. స్టేజీపై మాట్లాడటం కోసం ప్రిపేర్ అయింది కాస్త ఇప్పుడు వీడియోలో చెప్పేసింది.

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.
 

devara


జాన్వీ ఏం చెప్పిందంటే?


'అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ఇంతగా స్వాగతించి నా మీద ఇంత ప్రేమని చూపించిన తెలుగు ఆడియెన్స్ అలానే నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సర్ ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీలవడం నాకెంతో ఆనందంగా ఉంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో తెలుసు. అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం. అలానే నాకు కూడా'

Junior NTR Devara film director Koratala Shiva remuneration out


'నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీరందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను. శివ సర్, ఎన్టీఆర్ సర్ ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేసుకోవడం నా అదృష్టం. మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. నాకు చాలా సహాయపడిన చిత్రబృందానికి థ్యాంక్స్' అని వీడియోలో జాన్వీ కపూర్ తెలుగులో మాట్లాడింది.

ఇక ఈ వీడియోకి 'నేను ఈ మాటలు స్వయంగా మీతో చెబుదామనుకున్నాను. కానీ ఈ సారికి అలా కుదరలేదు. మిమ్మల్నందరినీ త్వరలోనే కలుస్తాననుకుంటున్నా. ప్రస్తుతానికి ఇది నా నుంచి మీకు ఈ చిన్న మెసేజ్' అని జాన్వీ రాసుకొచ్చింది.
  

 దేవర సినిమా సక్సెస్  దర్శకుడు కొరటాల శివకు ఎంత అవసరమో ..అంతకు మించి ఎన్టీఆర్ కు ఉంది. అందుకు కారణం సోలోగా ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి ఎన్టీఆర్ ఈ సినిమాతో ప్రవేశిస్తూండటమే.    ఎన్టీఆర్ దాదాపు ఆరేళ్ల తర్వాత చేస్తున్న సోలో చిత్రం ఇది. అంటే దేవర భారం మొత్తం  ఎన్టీఆర్ తో  పాటు కొరటాల శివ  భుజాలపైనే కూడా ఉంది. దానికి తోడు RRR వంటి గ్లోబ‌ల్ హిట్ త‌ర్వాత వ‌స్తున్న చిత్రం కావ‌డంతో ఎక్సపెక్టేషన్స్ ఓ రేంజిలో ఉన్నాయి.  ఫ్యాన్స్  తో సమానంగా యాంటీ ప్యాన్స్ కూడా ఈ మూవీ కోసం వేయి కండ్ల‌తో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.  ఇప్ప‌టికే రిలీజైన పాట‌లు జనాల్లోకి బాగా వెళ్లాయి. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ సూపర్  టాక్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు బాగా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.


అయితే నార్త్ బెల్ట్ లో ఎన్టీఆర్ ..తన ఆర్.ఆర్.ఆర్ చిత్రంతోనే పాపులర్ అయ్యారు. ఆ సినిమా ఆయన సోలో చిత్రం కాదు. దాంతో ఎన్టీఆర్ ఇప్పుడు వారికి కొత్తవాడే. కంటెంట్ అద్బుతంగా ఉంటేనే అక్కడవారికి నచ్చుతారు.   దాంతో ఈ ట్రైల‌ర్ బాగా నిరుత్సాహ ప‌ర్చిందని కామెంట్స్ చేస్తున్నారు.  కొరటాల శివ (Koratala Siva) కేజీఎఫ్ పార్మాట్ లో ఈ సినిమా తీద్దామనుకున్నాడు.. కానీ అది ఆచార్యలానే అయిందనిపిస్తూందంటూ మీమ్స్ క్రియేట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. గతంలో కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాలోని సీన్స్ లను, దేవర (Devara Part 1) ట్రైలర్‌లోని సన్నివేశాలను కంపేర్ చేస్తూ మరీ ట్రోలింగ్ చెస్తూ ఉన్నారు.
 

Latest Videos

click me!