Pushpa vs Peddi: పుష్ప, పెద్దికి మధ్య ఉన్న పోలికలివే.. ఆ విషయంలో రెండూ ఒక్కటే, కానీ తేడా ఏంటంటే?

Published : Jun 05, 2026, 07:57 PM IST

అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప`సినిమా సంచలన విజయం సాధించింది. అయితే ఇప్పుడు రామ్‌ చరణ్‌ నటించిన `పెద్ది`ని పుష్పతో పోల్చుతున్నారు. మరి ఆ పోలికలేంటి? రెండింటి మధ్య ఉన్న తేడాలేంటి? అనేది తెలుసుకుందాం. 

PREV
15
పుష్ప, పెద్ది మధ్య ఉన్న పోలీకలు

రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన `పెద్ది` సినిమా ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. ఈ చిత్రానికి రూ.135కోట్లు వచ్చినట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ మూవీకి అసలు పరీక్ష ఈ శుక్రవారం నుంచే స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. ఇకపై ఏ స్థాయిలో వసూళ్లని రాబడుతుందనే దాన్ని బట్టి ఈ మూవీ విజయం ఆధార పడి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి, `పుష్ప`కి పోలికలున్నాయనేది ఇప్పుడు సోషల్‌ మీడియాలో కామెంట్లు షురూ అయ్యాయి. మరి `పుష్ప`కి, `పెద్ది`కి మధ్య ఉన్న పోలికలేంటి? తేడాలేంటి? అనేది చూద్దాం.

25
పెద్ది కథ ఇదే

`పెద్ది` సినిమా.. అటవి ప్రాంతంలోని ఒక పేరుకి, గుర్తింపుకి నోచుకోని గ్రామ ప్రజల స్ట్రగుల్స్ ని తెలియజేస్తుంది. తమ పుట్టుకకి, తమ ఊరుకి గుర్తింపు లేని ఒక ఆటగాడు.. తమ గుర్తింపు కోసం ఆటని ఎంచుకోవడమే ఈ కథ. గుర్తింపు లేక అనేక అవమానాలు ఎదుర్కొన్న నేపథ్యంలో పెద్ది క్రికెటర్‌ నుంచి కుస్తీ పోటీలకు టర్న్ తీసుకోవడం, అట్నుంచి రన్నర్‌గా మారడం విశేషం. రన్నింగ్‌లో ఆయన ఛాంపియన్‌గా నిలిచి తమ ఊరుకి గుర్తింపు తీసుకురావడం కోసం ఆయన చేసే పోరాటమే ఈ సినిమా.

35
పుష్ప కథ ఏంటంటే

`పుష్ప` కథకి దీనికి సంబంధం ఏంటంటే.. `పుష్ప`లోనూ హీరో తన గుర్తింపు కోసం పోరాడుతుంటాడు. తన కుటుంబంలో తనకు గుర్తింపు లేదు. ఉంచుకున్న తల్లికి పుష్పరాజ్‌ జన్మిస్తాడు. తండ్రి నుంచి వాళ్లు.. ఇంటిపేరు ఇచ్చేందుకు నిరాకరిస్తారు. పైగా ప్రతి చోట అవమానిస్తారు. అటు పోలీస్‌ ఆఫీసర్‌ కూడా అవమానిస్తాడు. దీంతో తన గుర్తింపు కోసం, తానేంటో నిరూపించుకోవడం కోసం హీరో చేసే పోరాటమే ఈ మూవీ. ఎర్రచందనం కులీగా ప్రారంభమైన పుష్పరాజ్‌ జర్నీ.. కులీ నుంచి కూలీ పెద్దగా, ఆ తర్వాత ఒక ప్రాంతం లీడర్‌గా, అట్నుంచి సిండికేట్‌ ని శాసించే నాయకుడిగా ఎదగడమే ఈ మూవీ కథ. ఈ లెక్కన పెద్ది కథ, పుష్ప కథ ఒక్కటే అని చెప్పొచ్చు. రెండింటిలోనూ తమ గుర్తింపు కోసం పోరాటమే అని చెప్పాలి.

45
పుష్ప, పెద్ది మధ్య తేడాలు

మరి పుష్ప, పెద్దికి మధ్య ఉన్న తేడాలు ఏంటంటే?.. పెద్దిలో హీరో తమ ఊరు, తమ మనుషుల గుర్తింపు కోసం పోరాడుతాడు. ఒక న్యాయపరమైన పోరాటం చేస్తాడు. యువతకు స్పూర్తినింపే క్రీడని ఎంచుకుంటాడు. ఎన్నో అవమానాలు ఎదురైనా, వాటిని దాటుకొని ప్రపంచ ఛాంపియన్‌గా నిలుస్తాడు. పెద్దిది ఇన్‌స్పైర్‌ చేసే జర్నీ. తన వారి కోసం పోరాడిన వ్యక్తి కథ. కానీ పుష్పలో తన గుర్తింపు కోసం మాత్రమే హీరో పోరాడుతాడు. పైగా తాను ఎంచుకున్నది కూడా అక్రమ మార్గం. ఎర్రచందన స్మగ్లింగ్‌ అనేది నేరం. దాన్ని ఎంచుకుని ఆయన బాగా సంపాదించడం, సీఎంలనే మార్చే స్థాయికి ఎదిగడం గమనార్హం. స్మగ్లింగ్‌ సింగికేట్‌కే రూలర్‌గా మారతాడు పుష్ప.

55
అక్కడ స్ట్రగుల్‌, ఇక్కడ ఎలివేషన్లు

పెద్ది సినిమా హీరో స్ట్రగుల్స్ బేస్డ్ గా సాగుతుంది. హీరో ఆవేదన, బాధ ఉంటుంది. అతని పెయిన్‌ అడగడుగునా కనిపిస్తుంది. కానీ పుష్పలో ఎలివేషన్లు ఉంటాయి. యాక్షన్‌ సీన్లు, ఎలివేషన్లే ప్రధానంగా ఈ మూవీ సాగుతుంది. పెద్ది ఎమోషన్స్ ప్రధానంగా సాగితే, పుష్ప ఎలివేషన్ల ప్రధానంగా సాగుతుంది. అందుకే పెద్దికి మిశ్రమ స్పందన, పుష్ప బ్లాక్‌ బస్టర్‌ టాక్‌తో దూసుకుపోయింది. అయితే `పుష్ప`లో నటనకు అల్లు అర్జున్‌కి నేషనల్‌ అవార్డు వరించింది. ఇప్పుడు పెద్దిలోని రామ్‌ చరణ్‌ నటనకు కూడా జాతీయ అవార్డు వస్తుందని భావిస్తున్నారు. `పుష్ప2` మూవీ సుమారు రూ.1800కోట్లు రాబట్టింది. మరి పెద్ది ఏ రేంజ్‌లో వసూళ్లని రాబడుతుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories