త్వరలో ‘సింహాద్రి’ హీరోయిన్ రీఎంట్రీ? ఇన్నాళ్లు సినిమాలకు దూరమవ్వడానికి కారణం అదేనా?

First Published | Jul 14, 2023, 10:27 AM IST

‘సింహాద్రి’ హీరోయిన్  సినిమాలకు దూరమైన చాలా కాలమైంది. వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని స్థిరపడింది. అయితే ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉండటానికి కారణాలను పరోక్షంగా చెప్పుకొచ్చింది. 
 

టాలీవుడ్ హీరోయిన్ అంకిత జావేరి (Ankitha Jhaveri) 2002 నుంచి ఐదారేళ్ల పాటు వరుస చిత్రాలతో అలరించింది.  ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సిహాంద్రి’, ‘విజయేంద్ర వర్మ’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 
 

అయితే కెరీర్ చివర్లో ఆమె సినిమాలు పెద్దగా ఆశించిన మేర ఫలితానివ్వలేకపోయాయి. దాంతో ఆఫర్లూ తగ్గుతూ వచ్చాయి. ‘సింహాద్రి’ చిత్రంతో భారీ హిట్ ను అందుకుంది. అంతకు ముందు రస్నా జ్యూస్ డ్రింక్ ప్రాడక్ట్ ను అడ్వర్టైజ్ చేసి ‘రస్నా బేబీ’గానూ గుర్తింపు పొందింది. ఈ యాడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. 
 


2009 వరకు కొన్ని చిత్రాల్లో నటించిన అవి ప్రేక్షకుల ముందుకు వచ్చినట్టుగా లేవు. ఆ తర్వాత నుంచి అవకాశాలు కూడా లేకపోవడంతో క్రమంగా సినిమాలకు దూరమైంది. 2016లో వ్యాపారవేత్త విశాల్ జగపతిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ప్రస్తుతం యూఎస్ఏలో స్థిరపడింది.
 

అయితే త్వరలో అంకిత ఇండస్ట్రీకి తిరిగి రాబోతున్నట్టు ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘విజయేంద్రవర్మ చిత్రంపై హోప్స్  పెట్టుకున్నాను. కానీ సక్సెస్ రాలేదు. ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే కెరీర్ బాగుండేదని‘ చెప్పుకొచ్చింది. 
 

అయితే సక్సెస్ లేకపోవడమే తను సినిమాలకు దూరమైనట్టుగా పరోక్షంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.. ఇక తనకు దివంగత హీరోయిన్ ఆర్తీ అగర్వాల్, ఉదయ్ కిరణ్ మంచి స్నేహితులని.. ప్రస్తుతం వారు లేకపోవడం బాధాకరమని కూడా చెప్పారు. 
 

ఇక 14 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న అంకితా రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో సోషల్ మీడియాలో టచ్ లో ఉంటున్నట్టు కూడా చెప్పారు. మంచి అవకాశం వస్తే తిరిగి నటించడానికి సిద్దంగా ఉన్నట్టు తెలిపారు. 
 

Latest Videos

click me!