STR 50: తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌గా సింబు, కమల్‌ హ్యాండివ్వడంతో స్టార్‌ హీరో రిస్క్

Published : May 23, 2025, 11:56 PM IST

`థగ్‌ లైఫ్‌` సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న సింబు, తన తదుపరి సినిమాలో ట్రాన్స్‌జెండర్‌గా నటించనున్నట్లు తెలిపారు.

PREV
14
కొత్త సినిమా కబుర్లు చెప్పిన సింబు

కమల్ హాసన్, మణిరత్నం కలిసి నటిస్తున్న ‘థగ్‌ లైఫ్‌` జూన్ 5న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా, తన తదుపరి సినిమా ‘STR 50’ గురించి సింబు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన పాత్ర ఎలా ఉంటుందో కూడా వెల్లడించారు. 

24
నెక్ట్స్ మూవీలో ట్రాన్స్ జెండర్‌గా సింబు

ఈ సినిమాలో ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటిస్తున్నానని సింబు చెప్పారు. `ఈ పాత్రను ఎలా చేయాలో కమల్ హాసన్ గారితో చర్చించాను. ఇలాంటి డిఫరెంట్‌ రోల్స్ వచ్చినప్పుడే నటుడి నిజమైన  యాక్టింగ్‌ టాలెంట్‌ బయటపడుతుంది` అని అన్నారు. తన 50వ సినిమాను తన సొంత బ్యానర్ ఆత్మన్ సినీ ఆర్ట్స్‌లో నిర్మిస్తున్నట్లు తెలిపారు సింబు.

34
కమల్‌ తప్పుకోవడంతో నిర్మాతగా మారిన సింబు

`ఈ మూవీని సొంతంగా నేనే నిర్మించడం మంచిదని భావిస్తున్నాను.  రాజీ పడకుండా నాకు నచ్చినట్లు సినిమా తీయగలను` అని సింబు తెలిపారు. మొదట ‘STR 50’ని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో సింబు తానే స్వయంగా నిర్మించాలని నిర్ణయించుకున్నారట. 

44
సింబు మూవీపై కమల్‌ స్పందన ఇదే

`థగ్‌ లైఫ్‌`కి సింబు అవసరం కాబట్టి,  ఆ సినిమాను వదిలేశాం. కానీ వాళ్లు ఆ మూవీ చేసుకోవచ్చు, అది మంచి కథ` అని అదే ఇంటర్వ్యూలో కమల్ చెప్పారు. చాలా కాలంగా సింబు సినిమాలకు సంగీతం అందించిన యువన్ శంకర్ రాజా ‘STR 50’ కోసం మళ్ళీ సింబుతో కలిసి పనిచేస్తున్నారు. దేశింగు పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ప్రవీణ్ ఎడిటింగ్ చేస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories