Anchor Suma Remuneration: యాంకర్ సుమ.. దశాబ్దాలుగా బుల్లితెరపై ‘మకుటం లేని మహారాణి’లా స్టార్ యాంకర్ గా రాణిస్తున్నారు. ఆమె ఒక్కొక్క ఈవెంట్ కు ఎంత పారితోషికం తీసుకుంది ? ఇంతకీ ఆమె నెట్ వర్త్ ఎంత?
Anchor Suma: యాంకర్ సుమ కనకాల.. ఆమె యాంకరింగ్ కు బ్రాండ్ అంబాసిడర్. దశాబ్దాలుగా బుల్లితెరపై ‘మకుటం లేని మహారాణి’లా స్టార్ యాంకర్ గా రాణిస్తున్నారు. సుమ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది.
సుమ తర్వాత యాంకర్ గా ఎంతో మంది వచ్చినా.. ఆమెను మాత్రం బీట్ చేయలేకపోయారంటే అతిశయోక్తి కాదు. ఎన్నో టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూనే.. మరోవైపు సినిమా ఈవెంట్స్ చేస్తోంది. ఏ స్టార్ హీరో సినిమా ఈవెంట్ అయినా.. సుమ యాంకర్ గా ఉండాల్సిందే.
25
ఏ ఈవెంట్ అయినా సుమ ఉండాల్సిందే..
సుమ అంటే యాంకరింగ్.. యాంకరింగ్ అంటే సుమ అనేలా మారిపోయింది. వాస్తవానికి సుమ మలయాళీ అయినా తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంది. తన మాటలతో మైమరిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే యాంకర్ సుమ తెలియని తెలుగు ప్రేక్షకులుండరు.
ఎంత పెద్ద ఈవెంట్ అయినా ఏ మాత్రం తడబడకుండా, బెదరకుండా తన మాటల ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. తన యాంకరింగ్ తో రంజింప చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
35
సుమ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
అంతటీ పాపులారిటీని సొంతం చేసుకున్న సుమ ఒక్క షోకు ఎంత వసూలు చేస్తుంటారో తెలుసుకోవాలనీ చాలా మందికి ఆసక్తి ఉంటుంది. సుమ టీవీ షోల్లో యాంకరే కాదు.. స్టార్ హీరోలకు చెందిన ఏ ఫంక్షన్ అయినా, సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు అయిన ఆమె హోస్ట్ చేయాల్సిందే.
సినీ వర్గాల సమాచారం ప్రకారం..ప్రస్తుతం టెలివిజన్ లో షోలకు కూడా భారీ మొత్తం వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె ఒక్క ఎపిసోడ్ కు రూ.1.60 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ తీసుకుంటుందని టాక్.
ఇక యాంకర్ సుమ ప్రస్తుతం టీవీ షోలు, మూవీ ఈవెంట్లు, యూట్యూబ్ ప్రమోషనల్ వీడియోలు కూడా చేస్తుంది. సుమ ఒక్కో సినిమా ఈవెంట్, షోకు సుమారు రూ.3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేస్తోందట.
ఇక పెద్ద సినిమా ప్రమోషన్ లేదా ఎక్కువ గంటల యాంకరింగ్ అవసరమైతే అదనపు ఛార్జ్ కూడా ఉంటుంది. స్టార్ డిమాండ్ బట్టి సుమ ఒక్కో ఈవెంట్ కు ఒక్కోలా రెమ్యూనరేషన్ తీసుకుంటారంట.
55
50 ఏళ్ల వయస్సులోనూ తగ్గేదేలే..
సుమ 50 ఏళ్ల వయస్సులో కూడా ఏ మాత్రం ఆలసట లేకుండా, తమ మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అదే సమయంలో యంగ్ యాంకర్స్ తో పోటీపడుతుంది. సుమ కనకాల ఆస్తుల విషయానికి వస్తే సుమారు రూ.40 - 50 కోట్ల విలువ కలిగిన ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.
సుమ నెల ఆదాయం సుమారు 8- 10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. మొత్తానికి సుమ యాంకరింగ్‌తోపాటు యూట్యూబ్‌లో మూవీ ప్రమోషన్, ఇంటర్వ్యూల ద్వారా కూడా సంపాదన చేస్తోంది. అంతే కాకుండా కొన్నిసార్లు సినిమాల్లో కూడా నటించి అదనపు ఆదాయాన్ని పొందుతుందట.