సిద్దు జొన్నలగడ్డ గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీల, డీజే టిల్లు లాంటి చిత్రాలతో రొమాంటిక్ హీరోగా మారిపోయాడు. డీజే టిల్లు బ్లాక్ బస్టర్ కావడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా అనే సాంగ్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సారి కూడా ఎంటర్టైన్మెంట్ ఏమాత్రం తగ్గదు అని భరోసా చిత్ర యూనిట్ ఇస్తోంది.