Taapsee Pannu Relationship : ప్రియుడిపై తాప్సీ పన్ను ఆసక్తికర కామెంట్స్.. ఆమె క్లారిటీకి శభాష్ అనాల్సిందే!

Published : Mar 11, 2024, 04:24 PM ISTUpdated : Mar 11, 2024, 04:25 PM IST

టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను (Taapsee Pannu) తాజాగా తన రిలేషన్ షిప్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అతనితో ఇప్పుడు ఎలా మూవ్ అవుతుందో చెప్పుకొచ్చింది.   

PREV
16
Taapsee Pannu Relationship : ప్రియుడిపై తాప్సీ పన్ను ఆసక్తికర కామెంట్స్.. ఆమె క్లారిటీకి శభాష్ అనాల్సిందే!

నటి తాప్సీ పన్ను గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినప్పటికీ గతంలో మాత్రం గుర్తుండిపోయే సినిమాల్లో నటించింది. 
 

26

ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమై... ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. 
 

36

మిస్టర్ పర్ఫెక్ట్, వీర, మొగుడు, దరువు, షాడో, ది ఘాజీ అటాక్, చివరిగా తెలుగులో ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రాల్లో నటించింది. విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులకు అలరించింది. 

46

అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోనే వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. చివరిగా అక్కడ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)  సరసన ‘డంకీ‘ (Dunki) చిత్రంలో నటించి మెప్పించింది. 

56

ఇదిలా ఉంటే.. తాజాగా తాప్పీ పెళ్లిపై రూమర్ల వచ్చిన విషయం తెలిసిందే. డెన్మార్క్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బో (Mathias Boe) తో కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉంటోంది. అయితే ఆయన గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తాప్సీ.
 

66

తను ఓ మేచ్యుర్డ్ వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్నానని తెలిపారు. ఇన్నేళ్లైనా పెళ్లిచేసుకోకవడంపై స్పందిస్తూ... మా రిలేషన్ లో ఎలాంటి మార్పులు రాలేదని చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. ప్రతి అమ్మాయి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించింది. తను సరైన వ్యక్తితో రిలేషన్ లో ఉన్నామా? లేదా అన్నది చూడాలన్నారు. ఆ రిలేషన్ ను భారంగా ఫీల్ కాకుండా చూసుకోవాలని తెలిపింది. ప్రస్తుతం తను హ్యాపీగానే ఉన్నానంది. ఇక పెళ్లిపై సమయం వచ్చినప్పుడు అప్డేట్ ఇస్తానంది. 

Read more Photos on
click me!

Recommended Stories