సిద్‌ శ్రీరామ్‌, రామ్‌ మిర్యాల, శ్వేత, మంగ్లీ, గీతా మాధురీ.. స్టార్‌ సింగర్స్ లో ఎక్కువ పారితోషికం ఎవరికంటే?

Published : Apr 06, 2024, 02:01 PM IST

టాలీవుడ్‌లో సింగర్స్ లో చాలా మంది స్టార్‌ సింగర్స్ గా రాణిస్తున్నారు. అయితే వీరికి అందే పారితోషికాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఎవరు ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారో తెలుసా?

PREV
110
సిద్‌ శ్రీరామ్‌, రామ్‌ మిర్యాల, శ్వేత, మంగ్లీ, గీతా మాధురీ.. స్టార్‌ సింగర్స్ లో ఎక్కువ పారితోషికం ఎవరికంటే?
Tollywood top stars remunerations details

చిత్ర పరిశ్రమలో ఎక్కువగా స్టార్‌ హీరోలు, హీరోయిన్లకి సంబంధించిన పారితోషికాలే చర్చకు వస్తుంటాయి. సినిమా సక్సెస్‌లను బట్టి వారి పారితోషికాలు మారుతాయి. పైగా భారీ స్థాయిలో ఉంటాయి. సినిమా బడ్జెట్‌ని మించి వారి రెమ్యూనరేషన్స్ ఉంటాయి కాబట్టి వాటిపైనే అందరి దృష్టి ఉంటుంది. ఓ సినిమా హిట్‌ అయ్యిందంటే నెక్ట్స్ మూవీకి రెమ్యూనరేషన్‌ పెంచేస్తుంటారు హీరోలు, హీరోయిన్లు. 
 

210

కానీ సింగర్స్ కి సంబంధించిన చర్చ చాలా తక్కువగా వస్తుంటుంది. వారి పారితోషికాలు కూడా తక్కువే. కానీ వారి పాటలే సినిమాలను జనంలోకి తీసుకెళ్తాయి. సినిమాలపై చర్చకు కారణమవుతుంది. కంటెంట్‌ ఆడియెన్స్ కి రీచ్‌ అవ్వడానికి ఉంటుంది. చాలా మంది తెలుగు సింగర్స్ కి శ్రోతల్లో మంచి ఫాలోయింగ్‌ ఉంటుంది. వారి పాట వచ్చిందంటే గంటల్లోనే ట్రెండింగ్‌ అవుతుంది. అలాంటి సింగర్స్ ఎవరు, వాళ్లు సినిమాకి ఎంత తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరి ఎవరు ఎంత తీసుకుంటున్నారనే లెక్కలు చూస్తే.. 
 

310

సిద్‌ శ్రీరామ్‌ టాప్‌లో ఉంటారు. ఆయన ఒక్కో పాటకి ఆరేడు లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నాడట. బడ్జెట్‌, సినిమా రేంజ్‌ని బట్టి లక్ష అటు, ఇటుగా ఉంటుందని తెలుస్తుంది. 
 

410

ప్రామిసింగ్‌ సింగర్స్ లో రామ్‌ మిరియాల ఒకరు. ఆయన ప్రత్యేకమైన గాత్రంతో ఆకట్టుకుంటున్నారు. ఫోక్‌ నుంచి, క్లాసిక్స్ వరకు ఎలాంటి పాత్రలైనా అద్భుతంగా పాడుతూ మెప్పిస్తున్నారు. ఆయన ఒక్కో పాటకి రెండు, మూడు లక్షలు తీసుకుంటున్నారు.
 

510

అలాగే మరో యంగ్‌ సెన్సేషన్‌ అనురాగ్‌ కులకర్ణి కూడా బాగానే అందుకుంటున్నాడట. ఆయన ప్రస్తుతం ఒక్కోపాటకి రెండు మూడు లక్షలు అందుకుంటున్నారట అనురాగ్‌. 
 

610

సింగర్‌ గీతా మాధురీ స్పెషల్‌ వాయిస్‌తో అలరిస్తుంది. నస్కీ వాయిస్‌తో పాటలు పాడుతూ ఆకట్టుకుంటుంది. ఐటెమ్‌ సాంగ్‌లకు ఆమె గాత్రం చాలా ఫేమస్‌. అయితే ఇప్పుడు ఆమె జోరు తగ్గింది. ప్రస్తుతం ఆమె ఒక్కో పాటకి లక్ష వరకు, మహా అయితే లక్షన్నర తీసుకుంటుందట. 
 

710

ఇటీవల మాస్టారూ మాస్టారూ అంటూ దుమ్మురేపింది శ్వేత మోహన్‌. ఆమె స్టార్‌ సింగర్ల జాబితాలో చేరింది. ఆమె కూడా ఒక్కో పాటకి భారీగానే తీసుకుంటుందట. ఆమె రెండు మూడు లక్షల వరకు అందుకుంటుందని సమాచారం.
 

810

ఇక తెలుగు ఫోక్‌ సాంగ్‌లకు కేరాఫ్‌ సింగర్‌ మంగ్లీ. మంచి ఊపు తెచ్చే పాటలతో అలరిస్తుంది మంగ్లీ. ఆమె కూడా ఇప్పుడు స్టార్‌ సింగర్స్ జాబితాలో చేరిపోయింది. ఆమె ఒక్కోపాటకి రెండు, మూడు లక్షల వరకు పారితోషికం తీసుకుంటుందట. 
 

910

మేల్ సింగర్స్ లో రేవంత్‌, శ్రీరామ్‌ చంద్ర, రాహుల్‌ సింప్లిగంజ్‌, రోహిత్‌, ఆర్య ధయాల్‌, శ్రీ కృష్ణ,  వంటి సింగర్స్ కూడా దాదాపు రెండు లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. 
 

1010

వీరు కాకుండా ఫీమేల్‌ యంగ్‌ టీమ్‌ ఉంటుంది. రమ్య బెహరా, మోహనా భోగరాజు, లిప్సిక, దామినీ భట్ల, యామిని, సమీరా భరద్వాజ్‌, సత్యా యామిని, మౌనిమ, సాహితి వంటి సింగర్స్ కూడా ఒక్కో పాటకి యాభై వేల నుంచి లక్ష వరకు పారితోషికం తీసుకుంటున్నారట. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories