‘అబ్బా.. మస్త్ లక్కీ నువ్వు’.. దిల్ రాజు రెండో పెళ్లిపై దారుణమైన ట్రోల్స్.. స్టార్ ప్రొడ్యూసర్ తొలి స్పందన

Published : Apr 06, 2024, 01:09 PM ISTUpdated : Apr 06, 2024, 01:11 PM IST

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) తన రెండో పెళ్లిపై వచ్చిన ట్రోల్స్ పై తాజాగా స్పందించారు. పలువురు ట్రోలర్స్ ను ఉద్దేశించి వారికి దిమ్మతిగిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

PREV
16
‘అబ్బా.. మస్త్ లక్కీ నువ్వు’.. దిల్ రాజు రెండో పెళ్లిపై దారుణమైన ట్రోల్స్.. స్టార్ ప్రొడ్యూసర్ తొలి స్పందన

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపే ఉంటుంది. ఆయన నిర్మించే ప్రతి సినిమాకు ఆయన కూడా ప్రమోషన్స్ లో ముందుంటారు. ఆసక్తికరంగా మాట్లాడుతుంటారు.

26

ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ నుంచి ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star)  చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నిన్ననే ఈ చిత్రం థియేటర్లలో విడుదలై ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది.

36

అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)  మరియు మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఇంట్రెస్టింగ్ గా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 
 

46

ఈ క్రమంలో రీసెంట్ ఇంటర్వ్యూలో దిల్ రాజు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గ్గా మారాయి. తన రెండో పెళ్లి తర్వాత వచ్చిన కొన్ని దారుణమైన కామెంట్స్ తనను బాధించినట్టు తెలిపారు. దానిపై ఫస్ట్ టైమ్ స్పందించారు.

56

దిల్ రాజు మాట్లాడుతూ.. ‘నేను రెండో పెళ్లి తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూకు కొన్ని దారుణమైన కామెంట్స్ వచ్చాయి. ‘భలే పట్టేశాడురా’ అంటూ నేను నా భార్యను మీట్ అయిన అంశంపై కొందరు కామెంట్లు పెట్టారు. నేను పెద్దగా అలాంటి వారిని పట్టించుకోను.

66

అయితే నన్ను గుర్తుపట్టే వారు కోటీ మంది ఉంటే.. అందులో ఇలాంటి కామెంట్లు పెట్టే వారు వెయ్యి నుంచి పది వేల మంది ఉండొచ్చు. కానీ 90శాతంగా ఉన్న నా బలాన్ని వదిలేసి అలాంటి వారికి నేను సమయం ఇవ్వను’. అంటూ కాస్తా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇక 2020లో దిల్ రాజు - తేజస్వి పెళ్లి ఘనంగా జరిగింది. వీరికి 2022లో పండంటి కొడుకు జన్మించాడు.

Read more Photos on
click me!

Recommended Stories