రెబల్ స్టార్ గా టాలీవుడ్ లో వెలుగు వెలిగిన కృష్ణం రాజు మంచి మనసున్న వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. కృష్ణంరాజు సినిమాలు తగ్గించిన తర్వాత తన వారసుడు ప్రభాస్ లో తనని తాను చూసుకుని మురిసిపోయారు. ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎదగడం తో కృష్ణంరాజు ఎంతో గర్వపడ్డారు. కృష్ణంరాజు కూడా తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అనుభవించారు.