హీరోయిన్‌తో ప్రభాస్‌ మ్యారేజ్‌.. పెద్దమ్మ రియాక్షన్‌ ఇదే.. ఆయన చేతుల్లోనే డార్లింగ్‌ పెళ్లి

Published : Aug 12, 2025, 05:01 PM IST

ప్రభాస్‌ పెళ్లికి సంబంధించిన వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. అయితే డార్లింగ్‌ హీరోయిన్‌ని పెళ్లి చేసుకుంటాడా? అనే ప్రశ్నకి పెద్దమ్మ శ్యామలా దేవి స్పందించింది. క్రేజీ ఆన్సర్‌ ఇచ్చింది. 

PREV
16
ప్రభాస్‌ పేరుతో ఐదారు వేల కోట్ల వ్యాపారం

ప్రభాస్‌ తెలుగు సినిమా లెక్కలు మార్చిన హీరో. అంతేకాదు ఇండియన్‌ సినిమాని ఏకం చేసిన హీరో. `బాహుబలి` సినిమాతో పాన్‌ ఇండియా ట్రెండ్‌కి తెరలేపి, ఏ భాష సినిమా అయినా ఇతర భాషల్లో డైరెక్ట్ గా రిలీజ్‌ చేసుకునే ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిన హీరో. ఓవరాల్‌గా భాష అనే బౌండరీలను బ్రేక్‌ చేసిన హీరోగా చెప్పొచ్చు. ఇప్పుడు మోస్ట్ కమర్షియల్‌ హీరోగా, అత్యంత మార్కెట్‌ ఉన్న హీరోగా డార్లింగ్‌ నిలిచారు. ఆయన పేరుతోనే ఐదారు వేల కోట్ల వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి లేదు.

DID YOU KNOW ?
ప్రభాస్‌- అనుష్క సినిమాలు
ప్రభాస్‌, అనుష్క కలిసి నాలుగు సినిమాలు చేశారు. `బిల్లా`, `మిర్చి`, `బాహుబలి` రెండు సినిమాల్లో కలిసి నటించారు. దీంతో వీరి మధ్య లవ్‌ రూమర్స్ వినిపిస్తున్నాయి.
26
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ప్రభాస్‌

ప్రభాస్‌ చేతిలో ఇప్పుడు ఆరు సినిమాలున్నాయి. రెండు చిత్రీకరణ దశలో ఉండగా, మరో నాలుగు ప్రారంభం కావాల్సి ఉంది. మరికొన్ని కమిట్‌ అయిన సినిమాలున్నాయి. ఒక్కో మూవీ బిజినెస్‌ వ్యాల్యూ చూస్తే ఈజీగా వెయ్యి కోట్లుగా చెప్పొచ్చు. సినిమా హిట్‌ అయితే రూ. 1500కోట్ల వరకు ఆశించవచ్చు. ఎంత ఎదిగినా, ఎంత స్టార్‌డమ్‌ ఉన్నా, చాలా సింపుల్‌గా ఉంటారు ప్రభాస్‌. ఆ ఇమేజ్‌ తాలూకూ యాటిట్యూడ్‌ ఎక్కడా కనిపించదు. ఎవరినైనా డార్లింగ్‌ అంటూ, మంచి భోజనం పెడుతూ బాగా చూసుకుంటారు.

36
ప్రభాస్‌ పెళ్లిపై పెద్ద సస్పెన్స్

ఇంత మంచి లక్షణాలు కలిగిన ప్రభాస్‌ మాత్రం ఇంక పెళ్లి చేసుకోలేదు. ఆయన ఓ ఇంటివాడు కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఫ్యామిలీ కోరుకుంటుంది. కానీ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. దాదాపు పది ఏళ్ల నుంచి ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు పెళ్లి చేస్తామని చెప్పారు. అమ్మాయిని చూస్తున్నామని తెలిపారు. కానీ ఎలాంటి అప్‌ డేట్‌ లేదు. ఇప్పుడు కృష్ణంరాజు లేకపోవడంతో ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామలాదేవికి ఆ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనిపై ఆమె తరచూ సమాధానం చెబుతూనే ఉంది. పెళ్లిచేస్తాం, టైమ్‌ రావాలి అని అంటూనే ఉంది. కానీ ఎప్పుడు చేస్తారు? ప్రభాస్‌ రియాక్షన్‌ ఏంటనేది వెల్లడించలేదు. 

46
శివుడు తలుచుకుంటేనే ప్రభాస్‌ పెళ్లి

తాజాగా మరోసారి ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామలాదేవికి డార్లింగ్‌ పెళ్లి ప్రశ్న ఎదురయ్యింది. ఆమె సోమవారం ద్రాక్షారామంలోని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్‌ పెళ్లిపై రియాక్ట్ అయ్యింది. పెళ్లి చేస్తామని, ప్రభాస్‌ పెళ్లి జరుగుతుందని తెలిపింది. ప్రభాస్‌ పెళ్లి కోసం అభిమానులతోపాటు కుటుంబ సభ్యులు కూడా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది. `బాబుకి పెళ్లి చేయాలని మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకున్నాను` అని తెలిపింది. అయితే ఈ సందర్భంగా ప్రభాస్‌ పెళ్లికి శివుడికి ముడిపెట్టింది. ఈ ఏడాది ఉంటుందా? అని రిపోర్టర్‌ ప్రశ్నించగా, `శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఆ పరమేశ్వరుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ప్రభాస్‌ పెళ్లి జరుగుతుంద`ని తెలిపింది శ్యామలాదేవి. తప్పకుండా ఆ శుభ సమయం వస్తుందని, అలాగే ఇంట్లో ఆడపిల్లలు కూడా ఉన్నారు. వారి పెళ్లిళ్లు కూడా జరగాలని ఆమె తెలిపారు. ఆమె సమాధానం ప్రకారం ప్రభాస్‌ పెళ్లి శివుడి చేతిలో ఉందని చెప్పొచ్చు.

56
హీరోయిన్‌తో ప్రభాస్‌ పెళ్లి.. శ్యామలాదేవి రియాక్షన్‌ ఇదే

ఈ సందర్భంగా రిపోర్టర్స్ నుంచి క్రేజీ ప్రశ్న ఎదురయ్యింది. ప్రభాస్‌కి పెళ్లి సినిమా హీరోయిన్‌తో చేస్తారా? బయట రిలేటివ్‌ అమ్మాయితో ఉంటుందా? అని ప్రశ్నించగా, ఆ విషయం తెలియదంటూ నవ్వుతూ రియాక్ట్ అయ్యింది శ్యామలాదేవి. కాకపోతే పెళ్లి మాత్రం జరుగుతుందని స్పష్టం చేసింది. మరి ఎప్పటిలాగే ప్రభాస్‌ పెళ్లికి సంబంధించిన సస్పెన్స్ అలానే వదిలేసింది. ప్రభాస్‌, అనుష్క ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ వార్తలు తరచూ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నిజంగానే వీరి మధ్య లవ్‌ ఉందా? అనేది సస్పెన్స్. ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా? ఎవరిని చేసుకుంటానే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

66
ఆరు సినిమాల లైనప్‌తో ప్రభాస్‌ బిజీ

ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న `ది రాజాసాబ్‌` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన కొంత షూటింగ్‌ పార్ట్ పెండింగ్‌లో ఉంది. డిసెంబర్‌ 5న మూవీ విడుదల కాబోతుంది. దీంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ`(వినిపిస్తున్న పేరు) చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటి వరకు కేవలం 50శాతం మాత్రమే షూటింగ్‌ కంప్లీట్‌ అయినట్టు సమాచారం. ఇది వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇంకోవైపు సెప్టెంబర్‌లో `స్పిరిట్‌` మూవీని స్టార్ట్ చేయాలని సందీప్‌ రెడ్డి వంగా ప్లాన్‌ చేస్తున్నారు. అలాగే ప్రశాంత్‌ వర్మతో ఓ మూవీ, `సలార్‌ 2`, కల్కి 2` చిత్రాలు చేయాల్సి ఉంది ప్రభాస్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories