అంత్యక్రియల్లో కృష్ణంరాజు పార్థివ దేహాన్ని మోసిన భార్య.. చివరి క్షణాల్లో కన్నీరుమున్నీరైన శ్యామలాదేవి.!

First Published Sep 12, 2022, 5:17 PM IST

రెబల్ స్టార్  కృష్ణంరాజు  (Krishnam Raju) అంత్య క్రియలు  తాజాగా ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. ఈ సందర్భంగా భార్య శ్యామాలా దేవి, కూతుర్లు చివరి క్షణాల్లో విలపించిన తీరు కంటతడి పెట్టిస్తోంది. ఈ సందర్భంగా కొన్ని చిత్రాలు వైరల్ అవుతున్నాయి.
 

టాలీవుడ్ సీనియర్ నటుడు, రెబల్ స్టార్  కృష్ణంరాజు అంత్యక్రియలు తాజాగా ముగిశాయి. ఆయన అంతిమ యాత్రలో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు అంతిమయాత్రను ఆయన నివాసం నుంచి బీఎస్‌ఆర్ కాలనీ బ్రిడ్జ్, గచ్చిబౌలి ఓఆర్‌ఆర్, అప్పా జంక్షన్ మీదుగా మొయినాబాద్ సమీపంలోని కనకమామిడి వరకు కొనసాగించారు. 

రాజుల వంశస్తుడు కావడంతో వారి పద్ధతుల్లోనే ఫౌమ్ హౌజ్ లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా భార్య  శ్యామాలాదేవి, కూతుర్లు కన్నీమున్నీరయ్యారు. అంత్యక్రియల్లో భాగంగా శ్యామాలాదేవి బోరున విలపించింది.  కృష్ణంరాజు తమని విడిచిపెట్టి వెళ్తుండటంతో తల్లడిల్లిపోయింది.
 

అంత్యక్రియల్లో భాగంగా కృష్ణంరాజు పార్థివ దేహాన్ని కూడా శ్యామాలా దేవి మోసింది. తను రోదించిన తీరును చుట్టూ ఉన్నవారు కూడా కన్నీరుపెట్టుకున్నారు. మరోవైపు కూతుర్లు కూడా చివరి క్షణాల్లో ఏడుస్తూనే ఉండిపోయారు. ప్రభాస్ కంటా నిన్నటి నుంచి కన్నీటి ధార కొనసాగింది. 
 

ఇక చివరి క్షణాల్లో కృష్ణంరాజును చూస్తూ కుటుంబికులు, అభిమానులు పెద్ద ఎత్తున రోదించారు. దీంతో కనకమామిడిలోని ఫౌమ్ హౌజ్ శోకసంద్రంతో నిండిపోయింది. హిందూ సంప్రదాయం ప్రకారం, ప్రభుత్వ లాంఛనాలతో అధికారింగా కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి. 
 

అయితే అంత్యక్రియల సందర్భంగా  కృష్ణంరాజు భార్య, కూతురు రోదించిన ఫొటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు, తెలుగు ప్రజలు కూడా కంటతడిపెట్టుకుంటున్నారు. ధైర్యంగా ఉండాలనూ భరోసా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ కు  నెటిజన్లు, అభిమానులు కూడా ధైర్యం చెబుతున్నారు. 

1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. 1966లో ‘చిలకా గోరింకా’తో వెండితెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత రెండో తరం స్టార్స్ లో ఒకరిగా ఎదిగాడు. కెరీర్ లో 187 చిత్రాల్లో నటించిన కృష్ణం రాజు చివరిగా రాధే శ్యామ్ మూవీలో నటించారు. ప్రభాస్ ని నటవారసుడిగా పరిశ్రమకు పరిచయం చేశాడు. 

click me!