ఎన్నో అంచనాల మధ్య విడుదలైన బ్రహ్మాస్త్ర చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ కి ఊపిరి పోసింది. చాలా కాలంగా సరైన విజయం లేక, జనాలు థియేటర్స్ కి రాక బాలీవుడ్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన బ్రహ్మాస్త్ర చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ కి ఊపిరి పోసింది. చాలా కాలంగా సరైన విజయం లేక, జనాలు థియేటర్స్ కి రాక బాలీవుడ్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. టాలీవుడ్ లో మాత్రం వరుస విజయాలు నమోదవుతున్నాయి. ఎట్టకేలకు బాలీవుడ్ వాళ్ళు కూడా ఓ భారీ విజయం రుచి చూశారు.
26
సెప్టెంబర్ 9న పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన బ్రహ్మాస్త్ర మూవీ అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రానికి కొంత నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ అది అంతగా ఇబ్బంది కావడం లేదు. అయాన్ ముఖర్జీ పురాణాలలో చెప్పబడిన బ్రహ్మాస్త్ర ఆయుధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు. రియల్ లైఫ్ జోడి రణబీర్ కపూర్, అలియా భట్ ఏఈ చిత్రంలో జంటగా నటించారు.
36
తొలి వీకెండ్ లో బ్రహ్మాస్త్ర చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 225 కోట్ల రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు రాబట్టింది. దీనితో బ్రహ్మాస్త్ర చిత్రం ఏ చిత్రాల వసూళ్లు అధికమించింది.. ఎలాంటి రికార్డ్స్ సాధించబోతోంది అంటూ చర్చ జరుగుతోంది. ఈ ఏడాది విడుదలై ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రాలు ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2. ఈ చిత్రాల వసూళ్లతో బ్రహ్మాస్త్ర కలెక్షన్స్ పోల్చుతున్నారు.
46
బ్రహ్మాస్త్ర చిత్రం తొలి వీకెండ్ వసూళ్లలో కెజిఎఫ్ 2 రికార్డుని అధికమించింది. ఫస్ట్ వీకెండ్ లో కెజిఎఫ్ 2.. 193 కోట్లు రాబట్టింది. బ్రహ్మాస్త్ర మాత్రం 225 కోట్లు సాధించి బిగ్ మార్జిన్ తో కెజిఎఫ్ 2 ని బీట్ చేసింది.
56
కానీ జక్కన్న రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ ల ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని టచ్ చేయడం మాత్రం అంత సులభం కాదు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఫస్ట్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా రూ 500 కోట్లు రాబట్టింది. ఆర్ఆర్ఆర్ చిత్రం తొలిరోజే ఏకంగా 223 కోట్లు సాధించింది.
66
ఇదిలా ఉండగా బ్రహ్మాస్త్ర జోరు చూస్తుంటే రణబీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించారు. మౌనిరాయ్ నెగిటివ్ రోల్ ప్లే చేయగా.. అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటించారు. తెలుగు వర్షన్ ని రాజమౌళి ప్రజెంట్ చేయడం విశేషం. సినిమా ప్రమోషన్ ని కూడా జక్కన్న దగ్గరుండి చూసుకున్నారు.