Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న నాని,సాయిపల్లవి, కృతిశెట్టి

Published : Dec 19, 2021, 11:45 AM ISTUpdated : Dec 19, 2021, 11:54 AM IST

గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని జిహెచ్ఎంసి పార్క్ లో మొక్కలు నాటారు శ్యామ్ సింగరాయ్ టీమ్. ఈ ఈవెంట్  లో  హీరో నాని తో పాటు హీరోయిన్స్ కృతిశెట్టి, సాయి పల్లవి,నిర్మాత బోయినపల్లి వెంకట్ కూడా పాల్గొన్నారు.

PREV
14
Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న నాని,సాయిపల్లవి, కృతిశెట్టి

ఈ నెల 24న  ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది శ్యామ్ సింగరాయ్ మూవీ. కలకత్తా నేపథ్యంలో సాగే ఈ కథను రాహుల్ సాంక్రుత్యన్ డైరెక్ట్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ ను స్పీడ్ అప్ చేశారు టీమ్. అటు సినిమా ప్రమోషన్ తో పాటు ఇటు గ్రీన్ ఇండియా ఛాలెంట్ కూడా పూర్తి అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు శ్యామ్ సింగరాయ్ బ్యాచ్.

24

హీరో నానితో పాటు..  హీరోయిన్ సాయిప్లవి, కృతిశెట్టి  కూడా సందడి చేశారు. ముగ్గరు కలసి పార్క్  లో మొక్కలు నాటారు. వీరితో పాటు శ్యామ్ సింగరాయ్ ప్రొడ్యూసర్ బోయిన పల్లి వెంకట్ కూడా ఈ ఈవెంట్ లో జాయిన్ అయ్యారు. స్టార్స్ రావడంతో.. ఆ చుట్టుపక్కల అంతా హడావిడిగా తయారయ్యింది. హీరో, హీరోయిన్లను చూడటానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు.

34

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని పిలుపునిచ్చారు.ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు.సినిమా ఇండస్ట్రీ,రాజకీయ నాయకులు ఇలా అందరూ పాల్గొంటున్నారు.ఈ కార్యక్రమం ప్రజల్లో ఎంతో అవగాహన కల్పిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని నాని అన్నారు.గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ దోహదపడుతుందని భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని నాని పిలుపునిచ్చారు...

 

44

మొక్కలు నాటిన తరువాత గ్రీన్ ఇండియా ఈ వెంట్ కు సంబంధించిన బుక్ ను అందుకున్నారు  శ్యామ్ సింగరాయ్ టీమ్. వృక్షవేదం పుస్తకాన్ని హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, కృతి శెట్టి కి నిర్వాహకులు అందజేశారు.ప్రకృతి పై ప్రేమతో వేదాలతో కూడిన వృక్షవేదం పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ సంతోష్ కుమార్ ను నాని, సాయి పల్లవి, కృతిశెట్టి అభినందించారు.

Read more Photos on
click me!

Recommended Stories