Shweta Tiwari:‘బ్రా’ వివాదం,దేవుడుకి కొలతలకు ముడెట్టేసింది,పోలీస్ కేసు!

Surya Prakash   | Asianet News
Published : Jan 28, 2022, 07:20 AM IST

శ్వేత తివారీ ఇటు బుల్లితెరతో పాటు, అటు వెండితెరపైనా సందడి చేస్తోంది. బుల్లితెరపై ‘హమ్‌ తుమ్‌ అండ్‌ థెమ్‌’, ‘మేరీ డాడ్‌కి దుల్హన్‌’ తదితర సీరియల్స్‌లో నటిస్తోంది. అయితే తాజాగా ఆమె ఓ వివాదంలో ఇరుక్కుంది. అది చాలా విచిత్రమైనది. హోం మినిస్టర్...పోలీస్ కేసు దాకా వెళ్లింది.

PREV
115
Shweta Tiwari:‘బ్రా’ వివాదం,దేవుడుకి కొలతలకు ముడెట్టేసింది,పోలీస్ కేసు!


కావాలని కొందరు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండటానికి ప్రయత్నిస్తూంటారు. దాని వల్ల వచ్చే మీడియా అటెన్షన్ ని ఎంజాయ్ చేస్తూంటారు. అలా ఎప్పుడూ ఏదో వ్యాఖ్యతో వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తూంటుంది హిందీ నటి శ్వేతా తివారీ. తన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'షో స్టాపర్' ప్రమోషన్‌లో భాగంగా భోపాల్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో తివారీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి.  దేవుడిని ఉద్దేశించి ఆమె అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. తివారీ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే...

 

215

 
 నటి శ్వేతా తివారీ గురించి బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితం. ఆమె తన టీవీ సీరియల్స్ తో దేశమంతా పాపులర్ అయింది. ఈ అందాల ఆంటీ ఇప్పుడు ఒక వివాదంలో ఇరుక్కొంది. ఆమె ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. దాని పేరు 'షో స్టాపర్' . ఈ వెబ్ సిరీస్ ప్రొమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన ఒక స్టేట్మెంట్ వివాదానికి కారణం.

315


ప్రెస్‌మీట్‌లో శ్వేతా తివారీ మాట్లాడుతూ.. తన లోదుస్తుల గురించి ప్రస్తావించారు. ఆ సందర్భంగా దేవుడి ప్రస్తావన తీసుకొచ్చారు. 'దేవుడు నా బ్రా కొలతలు తీసుకుంటున్నాడు..' అంటూ ఆమె వ్యాఖ్యానించారు. శ్వేత అన్న మాట ఏమిటంటే… “దేవుడు నా బ్రా సీజ్ కొలుస్తున్నాడు (God is taking the measurements for my bra).” ఆమె సరదాగా అని ఉండవచ్చు . కానీ అర్దం మరోలా జనాల్లోకి వెళ్ళింది. సాంస్కృతిక విధ్వంసానికి ఆమె పాల్పడుతోందని ఆమెపై విమర్శలకు దిగారు.

415


ఇక శ్వేతని ఎట్టి పరిస్దితుల్లోనూ అరెస్ట్ చెయ్యాలంటూ కల్చర్ ఆక్టివిస్ట్లు రంగంలోకి దిగారు. దాంతో, ఈ విషయంలో విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. శ్వేతా తివారీ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆమె తోటి నటీనటులు రోహిత్ రాయ్, సూర్యవంశీ, సౌరభ్ రాజ్ కూడా పక్కనే ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

515

ఇంతకీ, శ్వేత అలా ఎందుకు అంది? ఆమె చేస్తున్న వెబ్ సిరీస్ ఫ్యాషన్ రంగం చుట్టూ తిరుగుతుంది. ఆమె ఇందులో మోడల్ గా నటిస్తోంది. సౌరబ్ జైన్ అనే నటుడు ‘బ్రా’ ఫిట్టర్ పాత్ర పోషిస్తున్నాడు. గతంలో ‘మహాభారతం’ టీవీ సీరియల్ లో సౌరబ్ శ్రీకృష్ణుడి పాత్ర పోషించారు. సో, శ్వేత దేవుడు (సౌరబ్) నా బ్రా సైజు కొలుస్తున్నాడు అని జోక్ చేసింది. ఆమె మాట్లాడింది దేవుడు పాత్ర పోషించిన నటుడి గురించి. అయితే అసలు విషయం ప్రక్కన పెడి ఇది హైలెట్ అయ్యింది.  పొలీసు దర్యాప్తు వరకు వచ్చింది.

615


శ్వేతా తివారీ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్ అయ్యారు. 'శ్వేతా తివారీ చేసిన వ్యాఖ్యలు నేను విన్నాను... ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను..' అని పేర్కొన్నారు.

715


తివారీ వ్యాఖ్యలపై విచారణ జరిపి 24 గంటల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా భోపాల్ పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా శ్వేతా తివారీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామన్నారు.

815


 శ్వేతా రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రెండు పెళ్లిళ్లు కూడా విడాకులకు దారి తీయడంతో తన ఇద్దరు పిల్లలని ఒంటరిగా పోషించుకుంటోంది. ఆమె ఆ విషయంలో చాలా ఆవేదనతో ఉన్నారు. ఒంటరి మహిళగా జీవిస్తున్నారు.

915


ఇటీవల ఓ ఇంటర్య్వూలో శ్వేత మాట్లాడుతూ.. తన విడాకులు పిల్లలపై ఏవిధంగా ప్రభావం చూపుతుందో వివరించారు. ‘నేను జీవితంలో రెండు సార్లు మోసం పోయాను. ఆ ప్రభావం నాకంటే ఎక్కువగా పిల్లలపై పడింది. నేను చేసిన పెద్ద తప్పు నా జీవితంలోకి ఇద్దరు తప్పుడు పురుషులను ఆహ్వానించడం. దాని ఫలితం ఇప్పుడు నా ఇద్దరూ పిల్లలు అనుభవిస్తున్నారు.

 

 

1015


నా పిల్లల ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎప్పుడు గందరగోళంగా కనిపిస్తారు. అంతేగాక బాధను బయటకు కనిపించకుండా దాచుకోవడం అలవాటు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వారు సంతోషంగా ఎలా నవ్వుతున్నారో అర్థం కావడం లేదు. అందుకే కొన్ని సార్లు వారిద్దరిని మానసిక నిపుణుడి దగ్గరికి తీసుకువెళ్లి వారి మనసులో ఎముందో తెలుసుకోవాలను ప్రయత్నిస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు.

1115


అలాగే తన మొదటి భర్త రాజా చౌదరి తనని మానసికంగా, భౌతికంగా హంసించేవాడని, అందుకే అతడిపై గృహహింస కేసు పెట్టానని చెప్పింది. ‘పాలక్(మొదటి భర్త కూతురు)‌ 6 సంవత్సరాల నుంచి నా భర్త రాజా చౌదరి నన్ను కొట్టడం, తిట్టడం చూసింది.  తనకు చిన్నప్పటిక నుంచే పోలీసులు, లాయర్లు కేసులు తెలుసు.

1215


 ఇక శ్వేతా 2013లో అభినవ్‌ కోహ్లీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి రియాన్ష్‌ అనే కుమారుడు జన్మించాడు. ఇక రియాన్ష్(కుమారుడు)‌ గురించి చెబుతూ అతడికి ప్రస్తుతం 4 ఏళ్లు. ఈ వయసులోనే అతడు కూడా కోర్టు, పోలీసులు అంటే తెలుసు. ఇదంతా నావల్లే. నేను తప్పుడు వ్యక్తులను ఎంచుకోవడం వల్లే ఇలా జరిగింది.

1315


ఇందులో పూర్తిగా నా పొరపాటే ఉంది. వారిది కాదు. కానీ వారు ఎప్పుడు నాతో హ్యాపీ ఉంటారు. నన్ను నిందించరు’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా పాలక్‌ శ్వేతా మొదట్టి భర్త రాజా చౌదరిల కూతురు, రియాన్ష్‌ రెండవ భర్త అభినవ్‌ కోహ్లిల కుమారుడు.
అన్నట్లు, శ్వేతా తివారికి ఎదిగిన కూతురు ఉంది. ఆమె కూడా నటిగా అరంగేట్రం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

1415


శ్వేతా తివారీ హిందీలో 'మహాభారత', 'కసౌతి జిందగీ కయ్', 'జలక్ దిక్లాజా' బిగ్‌బాస్ (Bigg Boss) వంటి సీరియల్స్, రియాలిటీ షోలతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె 'షో స్టాపర్' వెబ్ సిరీస్‌లో 'బ్రా ఫిట్టర్' పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్ ఓటీటీలో విడుదల కానుండటంతో ప్రస్తుతం షో స్టాపర్ టీమ్ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు.

 

1515

41 ఏళ్ల బాలీవుడ్ నటి Shweta Tiwari సినిమాలు, టివి సీరియల్స్ తో బాగా పాపులర్ అయింది. బాలీవుడ్ అందగత్తెలలో శ్వేతా తివారికి సపరేట్ క్రేజ్ ఉంది. ఎంత అందంగా ఉన్నప్పటికీ బుల్లితెర హీరోయిన్లకు అంత క్రేజ్ ఉండదు. కానీ శ్వేతా తివారి విషయంలో అది వర్తించడం లేదు. 

click me!

Recommended Stories