Anupama Parameshwaran : తన నవ్వు విశాలమైందంటున్న ‘అనుపమా పరమేశ్వరన్’.. అవునంటున్న ‘మరో హీరోయిన్’..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 27, 2022, 08:40 PM IST

ఎవరి అందం వారికి ముద్దే.. ఎవరి నవ్వు వారికి వినసొంపుగానే ఉంటుంది. ఇదే తరహాలో హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తన చిరునవ్వుతో కూడా ఫొటోలకు పై క్యాప్షన్ పెట్టింది. వాటిపై మరో హీరోయిన్ కామెంట్ చేసింది.   

PREV
16
Anupama Parameshwaran : తన నవ్వు విశాలమైందంటున్న ‘అనుపమా పరమేశ్వరన్’.. అవునంటున్న ‘మరో హీరోయిన్’..

 వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది అనుపమా పరమేశ్వరన్. తాజాగా ‘రౌడీ బాయ్స్’ మూవీతో అలరించింది. తన బోల్డ్ సీన్స్ తో కుర్రాళ్లకు మతిపోగోట్టిందీ కేరళ బ్యూటీ. అదే జోష్ తో ఈ ఏడాది మరిన్ని సినిమాలతో ఆడియెన్స్ ను అలరించనుంది.

26

ప్రస్తుతం అనుపమా నిఖిల్‌తో `18పేజెస్‌` చిత్రంలో నటిస్తుంది. `కుమారి 21 ఎఫ్‌` ఫేమ్‌ పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. దీంతోపాటు అనుపమా మరో సినిమాలో నిఖిల్‌తో నటించబోతున్నట్టు తెలుస్తుంది.
 

36

తన కేరీర్ గ్రోత్ కోసం అనుపమా పరమేశ్వరన్‌ నెమ్మదిగా సినిమా ఛాన్స్ లు పెంచుకుంటోంది. గతేడాది ఈ అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదనే టాక్ వచ్చింది. కానీ సైలెంట్‌గా ఆఫర్స్ దక్కించుకుంటూ జాబితా పెంచుకుంటోంది.
 

46

 
 అటు సినిమాల్లో దూకుడు  పెంచిన ఈ భామ, ఇటు సోషల్ మీడియాలో నూ తన ఫాలోవర్స్, నెటిజన్లను ఖుషీ చేసేందుకు ఎప్పటికప్పుడు ఫొటో షూట్ లతో దర్శనమిస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఫొటోలు చూసిన పలువురు నెటిజన్లు తమ కామెంట్లను తెలియజేస్తున్నారు.

56

 అనుపమా పరమేశ్వరన్ ట్రెడిషనల్ వేర్ కనిపించింది. తన గ్లామర్ కు తగ్గట్టుగా పింక్ కలర్, ఫ్లవర్ కోటేడ్ డ్రెస్  ధరించడంతో మరింత అందంగా కనిపిస్తోంది. స్టైలిష్ లుక్ లో సరికొత్త స్టిల్స్ తో నెటిజన్ల ను ఆకర్షిస్తోంది అనుపమా.

66

అయితే ఈ పోటోల్లో మంద హాసంతో కనిపిస్తుంది అను. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘తన చిరునవ్వు విశాలమైంది’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇందుకు హీరోయిన్ ‘రాఖీ ఖన్నా’ ‘బ్యూటిఫుల్ స్మైల్’ అంటూ కామెంట్ పెట్టింది. ఏదేమైనా ఈ ముద్దుగుమ్మ నవ్వితే ఎవ్వరైనా బాగుందనే అనాలి కాదా.. 
 

click me!

Recommended Stories