సావిత్రి ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన `మహానటి`.. నాగ్‌ అశ్విన్‌ చేసిన పనికి కూతుళ్ల మధ్య గొడవలు.. ఏం జరిగిందంటే?

First Published Apr 20, 2024, 7:57 PM IST

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా `మహానటి` పేరుతో నాగ్‌ అశ్విన్‌ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇది పెద్ద హిట్‌ అయ్యింది. కానీ సావిత్రి ఇంట్లో చిచ్చుపెట్టిందట. 
 

Mahanati Savitri Rare Photos

అద్భుతమైన నటనతో మహానటిగా ఎదిగింది సావిత్రి. ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌, ఏఎన్నార్‌లకు దీటుగా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. హీరోయిన్లలో ఎవరికీ సాధ్యం కాని స్టార్‌ స్టేటస్‌ని పొందింది. నటిగా ఓ వెలుగు వెలిగిన సావిత్రి భర్త జెమినీ గణేషన్‌తో గొడవల కారణంగా కెరీర్‌ని నాశనం చేసుకుని చివరికి విషాదంగా ముగిసింది. అయినా ఆమె ఇప్పటికీ తమ సినిమాలు, పాత్రల్లో బతికే ఉందని చెప్పొచ్చు. 

mahanati

సావిత్రి తెలుగు, తమిళంలో ఎక్కువగా సినిమాలు చేసింది. రెండు రాష్ట్రాల్లో విశేష అభిమానాన్ని సంపాదించింది. ఆమెని కోట్ల మంది ఆరాధించారు. ఆమె జీవితాన్ని వెండితెరకు ఎక్కించాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. సావిత్రి మరణం వెనుక మిస్టరీ ఏంటి? ఆమె ఎలా కుంగిపోయింది, ఎలా కెరీర్‌ పడిపోయిందనే విషయాలను, బయటకు తెలియని విషయాలను `మహానటి` సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. 2018లో ఈ మూవీ వచ్చి పెద్ద విజయం సాధించింది. సావిత్రి ఇలానే ఉంటుందా అన్నట్టుగా `మహానటి` సినిమాలో కీర్తి సురేష్‌ పాత్రలో జీవించింది. 

`మహానటి` తెలుగు, తమిళంలో పెద్ద సక్సెస్ అయ్యింది. కానీ ఇది సావిత్రి ఇంట్లో చిచ్చు పెట్టిందట. వాళ్ల ఫ్యామిలీ మధ్య గొడవలకు కారణమయ్యిందట. సినిమా చూశాక సావిత్రి, జెమినీ గణేషన్‌ కూతుళ్ల మధ్య గొడవలు అయ్యాయట. ఇలా సినిమాని తీయడానికి ఎలా అనుమతిచ్చావంటూ జెమినీ గణేషన్‌ ఫస్ట్ వైఫ్‌ కూతుళ్లు తమతో గొడవలు పెట్టుకున్నారని సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి వెల్లడించారు.  
 

chamundeshwari

అమ్మ(సావిత్రి)ని నాన్న(జెమినీ గణేషన్‌) పెళ్లి చేసుకున్నప్పుడు పెద్దమ్మతో చిన్న చిన్న గొడవలు జరిగాయని ఆ తర్వాత కలిసిపోయారని, అమ్మ, పెద్దమ్మ బాగానే ఉండేవారని, వారి మధ్య చిన్న చిన్న మనస్పర్థాలు తప్ప పెద్ద గొడవలేమీ లేవని తెలిపారు విజయ చాముండేశ్వరి. పెద్దమ్మ తమని బాగా చూసుకునేదని, అలాగే అక్కలను అమ్మ బాగా చూసుకునేదని, పెద్దమ్మతో కంటే అమ్మతోనే అక్కలు ఫ్రీగా ఉండేవారని, వాళ్ల స్టడీస్‌, ఇతర విషయాలు ఏవైనా నాన్న, అమ్మనే చూసుకునే వాళ్లని, పెద్దమ్మ బయటకు వెళ్లేది కాదని చెప్పింది. తన పెళ్లి కూడా ఇద్దరమ్మలు కలిసి చేశారని వెల్లడించింది.

Mahanati Savitri Rare Photos

అమ్మ చనిపోయిన తర్వాత పెద్దమ్మ తమని చేరదీసిందని, బాగా చూసుకుందని, మీకు నేను ఉన్నానని భరోసా ఇచ్చిందన్నారు. అక్కలు, తాము బాగానే ఉండేవాళ్లమని, తమ మధ్య గొడవలంటూ జరిగాయంటే అది `మహానటి` సినిమా కారణంగానే అని చెప్పింది విజయ చాముండేశ్వరి. సినిమాలో నాన్న జెమినీ గణేషన్‌ని నెగటివ్‌గా, విలన్‌గా చూపించడం పట్ల సోషల్‌ మీడియాలో చాలా రకాలుగా కామెంట్లు వచ్చాయని అవి చూసి సిస్టర్స్ తమతో గొడవ పెట్టుకున్నారని ఆమె వెల్లడించింది. ఇలాంటి సినిమా తీయడానికి ఎలా ఒప్పుకున్నావని ఫైర్‌ అయినట్టు చెప్పింది. 

తెలుగు స్టేట్‌లో నాన్నని నెగటివ్‌గానే చూశారని, విలన్‌గానే చూస్తున్నారని, అది పోవడానికే కాస్త పాజిటివ్ గా చూపించమని నాగ్‌ అశ్విన్‌కి చెప్పినట్టు తెలిపింది. దర్శకుడు కూడా అలానే చూపించాడు. కానీ కామెంట్ల కారణంగా అక్కలు డిజప్పాయింట్‌ అయ్యారు. బాగా ఫీలయ్యారు. సోషల్‌ మీడియాలో ఇవన్నీ ఉంటాయని వారికి తెలియదు. దీంతో ఆవేశానికి గురయ్యారు, తమతో గొడవలు పెట్టుకున్నారని తెలిపింది. దీని కారణంగా తామంతా దూరమైనట్టు చెప్పింది. `మహానటి` ఓ రకంగా తమ ఫ్యామిలీలో చిచ్చు పెట్టిందని వెల్లడించారు. 
 

ఆ తర్వాత చాలా కాలం మాట్లాడుకోలేదని, ఇటీవలే ఓ ఫంక్షన్‌లో కలిసినప్పుడు హగ్‌ చేసుకుని మళ్లీ కలిసిపోయామని, వయసు మీద పడుతుందని ఇంకా ఈ గొడవలెందుకులే అని రాజీకీ వచ్చారని, ఇప్పుడు అంతా బాగానే ఉంటున్నామని చెప్పింది. మొత్తానికి `మహానటి` సావిత్రి ఫ్యామిలీ గొడవలకు కారణమయ్యిందని చెప్పొచ్చు. అయితే సినిమాలో చూపించినవి అన్నీ చాలా వరకు నిజాలే అని ఆమె చెప్పడం విశేషం. 

click me!