ప్రేమ్ శృతి (Shruthi) కి కొంత డబ్బు ఇచ్చి మిగతా డబ్బుతో సరుకులు తీసుకువస్తాను అంటూ వెళ్తాడు. ఆ తర్వాత రాములమ్మ ప్రేమ్ (Prem) ఉండే ఇంటికి అద్దె కట్టడానికి తులసిను 3000 అప్పు అడుగుతుంది. దాంతో తులసి డబ్బులు ఇచ్చి ఇంకా ఏమైనా బాధపడితే అడుగు అని రాములమ్మతో అంటుంది. దాంతో రాములమ్మ (Ramulamma) మీకు తెలియకుండానే మీరు మీ కొడుకుకు సహాయ పడుతున్నారు అని మనసులో అనుకుంటుంది.