Shruti Haasan: నైట్ టైం లో ప్రియుడితో శృతి హాసన్ రెచ్చిపోయి అలా... వైరల్ అవుతున్న క్రేజీ వీడియో!

Published : Jul 20, 2022, 01:04 PM IST

స్టార్ కిడ్ శృతి హాసన్ లైఫ్ తెరిచిన పుస్తకం. ఆమె ఏదైనా ఓపెన్ గానే చేస్తుంది. కమల్ హాసన్ వారసురాలిగా వెండితెరకు పరిచయమైన శృతి, చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు. వృత్తిపరమైన, వ్యక్తిగతమైన నిర్ణయాలు సొంతగానే తీసుకుంటారు. ఆమె జీవితంపై ఎవరికీ అజమాయిషీ ఉండదు.

PREV
16
Shruti Haasan: నైట్ టైం లో ప్రియుడితో శృతి హాసన్ రెచ్చిపోయి అలా... వైరల్ అవుతున్న క్రేజీ వీడియో!
shruti haasan

తండ్రికి మాదిరి శృతి(Shruti Haasan) కూడా మల్టీ టాలెంటెడ్. యాక్టింగ్ తో పాటు ఆమె ప్రొఫెషనల్ సింగర్. వెస్ట్రన్ మ్యూజిక్ లో ఆరితేరింది. అలాగే ఆమెకు రైటింగ్ లో ప్రవేశం ఉంది. ఇక కెరీర్ బిగినింగ్ లోనే బోల్డ్ రోల్స్ చేసి తాను అందరి లాంటి అమ్మాయి కాదని రుజువు చేసింది. 
 

26


హీరోయిన్ గా మొదట్లో శృతి ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆమెకు కాలం కలిసి రాలేదు. వరుస ప్లాప్స్ తో ఐరన్ లెగ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే గబ్బర్ సింగ్ సినిమాతో ఆమె కమ్ బ్యాక్ అయ్యారు. ప్లాప్స్ లో ఉన్న శ్రుతికి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఛాన్స్ ఇచ్చారు. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కాగా శృతి కెరీర్ లో మొదటి హిట్ సొంతం చేసుకుంది. 

36

రేసు గుర్రం, శ్రీమంతుడు, బలుపు వంటి హిట్ చిత్రాలతో శృతి తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా పట్టేసింది. కెరీర్ పీక్స్ లో ఉండగా శృతి ప్రేమలో పడింది. లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే అనే వ్యక్తిని శృతి ప్రేమించారు. అతనితో రెండేళ్లకు పైగా చట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఆ సమయంలో శృతి ఎక్కువగా లండన్ లోనే ఉండేవారు. 

46

కారణం తెలియదు కానీ 2019లో శృతి, మైఖేల్ విడిపోయారు. సోషల్ మీడియా అకౌంట్స్ నుండి ఫోటోలు, జ్ఞాపకాలు చెరిపేశారు. బ్రేకప్ తర్వాత శృతి లండన్ లో లైవ్ మ్యూజిక్ షోస్ ఇచ్చారు. ఇండియాకు వచ్చి కెరీర్ పై ఫోకస్ పెట్టారు. శృతి కమ్ బ్యాక్ బాగానే ఉంది. వకీల్ సాబ్, క్రాక్ వంటి హిట్స్ తో పాటు చిరంజీవి, బాలయ్య, ప్రభాస్(Prabhas) వంటి స్టార్స్ పక్కన ఛాన్స్ కొట్టేశారు. 

56

కెరీర్ అలా ఉండగా పర్సనల్ లైఫ్ ని కూడా అందంగా మార్చేసుకుంది శృతి. ప్రాక్టికల్ గా ఆలోచించే శృతి మరో తోడు వెతుక్కుంది. గత రెండేళ్లుగా శృతి ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో డేటింగ్ చేస్తున్నారు. ఈ జంట ఒకటే ఇంటిలో కలిసి ఉంటున్నారు.

66

శాంతను తన ప్రేమికుడని శృతి ఏనాడూ చెప్పలేదు. పరోక్షంగా హిట్ ఇచ్చారు. శాంతనుతో ఆమె కలిసి ఉంటున్నారు. విందులు వినోదాలు చేసుకుంటున్నారు. బర్త్ డే పార్టీలు నిర్వహిస్తున్నారు. తరచుగా శాంతనుతో కూడిన వీడియోలు శృతి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇద్దరూ కలిసి స్టెప్స్ వేశారు. శాంతనుతో డాన్స్ చేసిన వీడియో శృతి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories