ఆ ట్రోల్స్ పై స్పందించిన శృతి హాసన్‌.. యాంటీ వాలెంటైన్స్ వైబ్స్

First Published Feb 17, 2021, 6:01 PM IST

తన ట్వీట్‌ని తప్పుగా అర్థం చేసుకున్నారని అంటోంది శృతి హాసన్‌. తనకు డేట్స్ లేకపోవడం వల్ల కన్నడ సినిమాలో నటించలేకపోయానని తెలిపింది. మూడేళ్ల క్రితం శృతి పెట్టిన ట్వీట్‌ని ఫ్యాన్స్ కొందరు రీ ట్వీట్‌ చేస్తూ శృతికి ట్యాగ్‌ చేస్తున్నారు. దీనిపై తాజాగా శృతి స్పందించింది. మరోవైపు యాంటి వాలెంటైన్స్ వైబ్స్ కి తెరలేపింది. 

శృతి హాసన్‌ 2017లో తాను ఇప్పట్లో కన్నడ సినిమాల్లో నటించే అవకాశాలు లేవని తెలిపింది. అప్పట్లో ఇది వైరల్‌గా మారింది.
undefined
ప్రస్తుతం శృతి..ప్రభాస్‌తో కలిసి కన్నడ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న `సలార్‌`లో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో కన్నడ అభిమానులు అప్పటి శృతి ట్వీట్‌ని ఇప్పుడు ట్యాగ్‌ చేస్తున్నారు. ట్రోల్‌ చేస్తున్నారు.
undefined
దీనిపై శృతి స్పందిస్తూ, `కన్నడ చిత్ర పరిశ్రమలో భాగంగా కావడం నాకెంతో ఆనందంగా ఉంది. `సలార్‌` బృందం ఎంతో ప్రత్యేకమైనది. గతంలోనే నేను ఓ కన్నడ సినిమా చేయాల్సి ఉంది. కాకపోతే డేట్స్ అడ్జెస్ట్ కాక చేయలేకపోయాను. దాన్ని వదిలేసుకోవల్సి వచ్చింది.
undefined
`సలార్‌` కథ, పాత్ర బాగా నచ్చింది. చిత్ర బృందం నచ్చడంతో వెంటనే ఓకే చేశా. అన్ని భాషా చిత్రాల్లో నటించడం ఆనందంగా ఉంది.
undefined
2017లో నేను చేసిన ట్వీట్‌ని అందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రతి ఇండస్ట్రీ, దర్శక, నిర్మాతలు, నటీనటుల పట్ల నాకు గౌరవం ఉంది ` అని పేర్కొంది.
undefined
రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన శృతి ఇటీవల తెలుగులో `క్రాక్‌` చిత్రంతో సూపర్‌ హిట్‌ని అందుకుంది.
undefined
ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌తో `వకీల్‌సాబ్‌` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు ప్రభాస్‌తో `సలార్‌` చిత్రం చేస్తుంది.
undefined
దీంతోపాటు తమిళంలో `లాభం` చిత్రంలో విజయ్‌ సేతుపతితో కలిసి నటిస్తుంది. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్‌ తాజాగా విడుదలైంది.
undefined
అలాగే `పిట్టకథలు` అనే ఓ వెబ్‌ సిరీస్‌లో బోల్డ్ రోల్‌ చేసింది శృతి హాసన్‌.
undefined
మరోవైపు శృతి ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. వాలెంటైన్స్ డే రోజు, `యాంటి వాలెంటైన్స్ డే`కి తెరలేపింది.
undefined
ఈ సందర్భంగా ఓ గదిలో పెద్ద టెడ్రీ బేర్‌ని కత్తితో పొడిచినట్టుగా ఉండగా, దాని పక్కన కూర్చొన్న ఫోటోని పంచుకుంది శృతి. ఇందులో `యాంటి వాలెంటైన్స్ డే వైబ్స్` అంటూ పేర్కొంది.
undefined
తన ప్రేమలో విఫలం కావడం వల్లే ఇలా పోస్ట్ పెట్టిందా? అనే చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.
undefined
click me!