బ్లాక్ అవుట్ ఫిట్ లో శృతిహాసన్ కిర్రాక్ స్టిల్స్.. టైట్ డ్రెస్ లో స్టార్ బ్యూటీ ఫిట్ నెస్ చూశారా!

First Published | Nov 20, 2023, 10:30 AM IST

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తోంది. తన పాత్రను అద్భుతంగా పెర్పామ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. మరోవైపు సోషల్ గ్రాండ్ గా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan)  కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇప్పటికీ సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తూ అలరిస్తోంది. మరీ ముఖ్యంగా ఛాలెంజింగ్ రోల్స్ తో అదరగొడుతోంది. 

ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలూ బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. దీంతో శృతి హాసన్ సక్సెస్ రేట్ పెరిగింది. మంచి ఫామ్ లో ఉంది. 


మరోవైపు నెక్ట్స్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘సలార్’ (Salaar Cease Fire)తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం వచ్చే నెలలోనే రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే శృతి రెండు హిట్లను సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత అమ్మడు రేంజ్ ఇంక పెరగనుంది.

పైగా శృతి హాసన్ కేవలం గ్లామర్ రోల్స్ లోనే కాకుండా యాక్షన్ కు స్కోప్ ఉన్న పాత్రల్లోనూ నటిస్తోంది. స్టంట్స్ చేస్తూ వెండితెరపై మ్యాజిక్ చేస్తోంది. ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియెన్స్ నూ ఫిదా చేస్తోంది. 
 

మరోవైపు ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన చేస్తున్న ప్రాజెక్ట్స్ కు తగ్గట్టుగా గ్రాండ్ లుక్ లో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోస్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 

ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో శృతి హాసన్ మైండ్ బ్లాక్ చేసింది. ట్రెండీ అవుట్ పిట్లలో ఈ స్టార్ హీరోయిన్ నెక్ట్స్ లెవల్ స్టిల్స్ ఇచ్చింది. అట్రాక్టివ్ ఫోజులతో నెటిజన్లను చూపుతిప్పుకోకుండా చేసింది. తాజాగా షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. 

Latest Videos

click me!