మంచు వర్షంలో తడిసి ముద్దవుతున్న శృతి హాసన్.. వెకేషన్‌లో క్రేజీ ఫీలింగ్‌ని పొందుతున్న స్టార్‌ హీరోయిన్‌

Published : Dec 10, 2022, 07:08 AM ISTUpdated : Dec 10, 2022, 07:09 AM IST

శృతి హాసన్‌ ఓ క్రేజీ హీరోయిన్‌. ఆమె చేసే ప్రతి పని చాలా క్రేజీగా ఉంటుంది. రెగ్యూలర్‌కి భిన్నంగా ఉంటూ ఆశ్చర్య పరుస్తుంది. ఇప్పటికే ఓ వైపు వణికే చలిలో జనంలో ఇబ్బంది పడుతుంటే శృతి హాసన్‌ మాత్రం ఐస్‌లో ముద్దవుతుంది.   

PREV
17
మంచు వర్షంలో తడిసి ముద్దవుతున్న శృతి హాసన్.. వెకేషన్‌లో క్రేజీ ఫీలింగ్‌ని పొందుతున్న స్టార్‌ హీరోయిన్‌

తాజాగా శ్రుతి హాసన్‌ (Shruti Haasan) ఐస్‌ రెయిన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. మంచు పర్వతాలలో ఆమె ఎంజాయ్‌ చేస్తుంది. ఓ వైపు పైనుంచి మంచు వర్షం కురుస్తుండగా, మరోవైపు మంచులోనే కూర్చొని ఎంజాయ్‌ చేస్తుంది. అక్కడ దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకుంది శృతి. 
 

27

వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది శృతి హాసన్‌. అన్‌లిమిటెడ్‌గా, అన్‌స్టాపబుల్‌గా ఆమె విహారయాత్రని ఎంజాయ్‌ చేస్తుండటం విశేషం. ప్రస్తుతం ఆమె తన ఫోటోలను అభిమానులతో పంచుకోగా, అవి వైరల్‌ అవుతున్నాయి. యూరప్‌లో ప్రస్తుతం ఈ విహారయాత్రని ఎంజాయ్‌ చేస్తుంది శృతి హాసన్‌. 
 

37

ప్రస్తుతం శృతి నటిస్తున్న చిత్రాల్లో చిరంజీవి `వాల్తేర్‌ వీరయ్య` ఉంది. ఇది సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. ఈ చిత్రంలోని రెండు పాటలకోసం రెండు రోజుల క్రితమే యూరప్‌ వెళ్లింది యూనిట్. చిరంజీవి ఆ విషయాన్ని వెల్లడించారు. అటు ఫ్యామిలీతో విహారయాత్ర ఇటు శృతితో వీరయ్య యాత్ర అని పేర్కొన్నారు. యూరప్‌లో ఈ పాటల చిత్రీకరణ చేయబోతున్నారట. 
 

47

అందులో భాగంగానే శృతి హాసన్‌ ఈ గ్యాప్‌లో తన వెకేషన్‌ని కంప్లీట్‌ చేసుకునే పనిలో పడింది. మంచుతో కప్పబడిన యూరప్‌ అందాలను ఆస్వాదిస్తుంది. తనదైన స్టయిల్‌ లో క్రేజీ ఫీలింగ్‌ని పొందుతుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 
 

57

శృతి హాసన్‌ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. రెండేళ్ల క్రితం సినిమాలు లేక ఖాళీగానే ఉన్న ఈ బ్యూటీ మళ్లీ వరుసగా సినిమాలకు కమిట్‌ అవుతుంది. ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే అవకాశాలు క్యూ కడతాయనడానికి నిదర్శనంగా నిలుస్తుంది. 
 

67

ప్రస్తుతం శృతి నటిస్తున్న వాటిలో చిరంజీవి `వాల్తేర్‌ వీరయ్య`, బాలకృష్ణ `వీర సింహారెడ్డి`, ప్రభాస్‌ `సలార్‌` ప్రధానంగా ఉన్నాయి. ఈ మూడు తెలుగు సినిమాలే కావడం విశేషం. ఇద్దరు సీనియర్లతో, ఒక పాన్‌ ఇండియా హీరోగా జోడీ కట్టింది శృతి. ఈ మూడు భారీ సినిమాలే కావడం విశేషం. 
 

77

మరోవైపు హాలీవుడ్‌లోనూ ఓ సినిమా చేస్తుందీ అందాల సోయగం. `ది ఐ` అనే సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చేస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. ఇది మొదటి ఇంగ్లీష్‌ ఫిల్మ్. ఈ సినిమా సక్సెస్‌ అయితే శృతి రేంజ్‌ మారిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories