Bigg Boss Telugu 6: అర్జున్ కి శ్రీసత్య హనీ ట్రాప్... కళ్ళకు కట్టినట్లు చూపించిన ఇనయా!

Published : Dec 09, 2022, 11:57 PM IST

లేటెస్ట్ సీజన్ చివరి ఎపిసోడ్స్ సో సోగా సాగుతున్నాయి. ఏమైనా ఈసారి బిగ్ బాస్ షో పూర్తి స్థాయిలో మెప్పించలేదు. అసలు ఫేమ్ లేని కంటెస్టెంట్స్ షోకి వచ్చినప్పుడు కూడా సక్సెస్ అయ్యింది. కానీ సీజన్ 6 అంతకంతకు నిరాశాజనకంగా సాగుతుంది.   

PREV
16
Bigg Boss Telugu 6: అర్జున్ కి శ్రీసత్య హనీ ట్రాప్... కళ్ళకు కట్టినట్లు చూపించిన ఇనయా!
Bigg Boss Telugu 6

బిగ్ బాస్ సీజన్ 6 కొద్ది రోజుల్లో ముగియనుంది. విన్నర్ టైటిల్ తో పాటు ప్రైజ్ మనీ కైవసం చేసుకోనున్నాడు. హౌస్లో రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తి, రోహిత్, ఇనయా, శ్రీసత్య ఉన్నారు. వీరిలో ఒకరు విన్నర్ కానున్నారు. అలాగే ఇద్దరు ఫైనల్ కి వెళ్లకుండానే ఎలిమినేట్ కానున్నారు. కాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ధైర్యానికి పరీక్ష పెడుతున్నాడు. కన్ఫెషన్ రూమ్ కి ఒక్కొక్కరినీ పిలిచి చుక్కలు చూపిస్తున్నాడు. 
 

26
Bigg Boss Telugu 6

కన్ఫెషన్ రూమ్ ని బిగ్ బాస్ డార్క్ రూమ్ గా మలచి హారర్ మూవీ సెటప్ చేశాడు. పాములు, గడ్డి, అస్థిపంజరాలతో భయంకరంగా తయారు చేశాడు. అలాగే దెయ్యం గెటప్ లో ఒకరిద్దినీ ఆ చీకటి గదిలో ఉంచారు. హారర్ మూవీ సౌండ్ ఎఫెక్ట్స్ తో కంటెస్టెంట్స్ ని తీవ్ర భయానికి గురి చేస్తున్నాడు. మొదట ఆదిరెడ్డి వెళ్ళాడు. ఆదిరెడ్డి ఎవరైనా తోడు కావాలని కోరడంతో శ్రీహాన్ ని పంపాడు. ఆదిరెడ్డి, శ్రీహాన్ చాలా భయపడ్డారు. 
 

36
Bigg Boss Telugu 6


తర్వాత ఇనయా, రేవంత్ వెళ్లడం జరిగింది. వీరిద్దరూ కొంచెం ధైర్యం ప్రదర్శించారు. ఒంటరిగా డార్క్ రూమ్ లో బిగ్ బాస్ చెప్పిన వస్తువు వెతికి బయటకు వచ్చారు. శ్రీసత్య బిగ్ బాస్ ఎంత చెప్పినా వెళ్ళలేదు. దీంతో బిగ్ బాస్ లక్ష రూపాయలు కట్ చేశాడు. ఆమెకు రెండో అవకాశం ఇచ్చాడు. అప్పుడు కూడా శ్రీసత్య నా వల్ల కాదు బిగ్ బాస్, ఎవరో ఒకరు తోడు ఉంటేనే కన్ఫెషన్ రూమ్ కి వెళతానని ఖరాఖండిగా చెప్పింది. చేసేది లేక కీర్తిని శ్రీసత్యకు తోడుగా పంపారు. తర్వాత రోహిత్ డార్క్ రూమ్ లోకి వెళ్లడం జరిగింది.

46
Bigg Boss Telugu 6

రోహిత్ టాస్క్ పూర్తి చేయక ముందే  కన్ఫెషన్ రూమ్ కి హౌస్ మేట్స్ అందరినీ పిలవడం జరిగింది. అప్పుడు కూడా శ్రీసత్య బాగా భయపడింది. శ్రీహాన్ ని వదలకుండా గట్టిగా పట్టుకొని కేకలు పెట్టింది. రోహిత్ తేవాల్సిన హ్యాట్ దొరకడంతో అందరూ కన్ఫెషన్ రూమ్ నుండి బయటకు వచ్చేశారు. 
 

56
Bigg Boss Telugu 6

అనంతరం ఆడియన్స్ తో పాటు తనని ఎంటర్టైన్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. గతంలో హౌస్లో జరిగిన కొన్ని కీలక సంఘటనలు రీక్రియేట్ చేయాలి అన్నారు. అలాగే ఒకరి పాత్రలు మరొకరు ధరించాలని సూచించారు. షో బిగినింగ్ లో శ్రీహాన్, ఇనయాకు మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇనయాను శ్రీహాన్ పిట్ట అనడంతో ఆమె సీరియస్ అయ్యారు. ఈ సంఘటన రీక్రియేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. శ్రీహాన్ గా రేవంత్, ఇనయాగా శ్రీసత్య చేశారు. అలాగే హోటల్ టాస్క్, రోహిత్ ఫైర్ అయిన వీపుపై బ్యాగ్స్ ఖాళీ చేసే టాస్క్స్ ని రీక్రియేట్ చేయాలని బిగ్ బాస్ కోరడం జరిగింది.

66
Bigg Boss Telugu 6

ఇతర కంటెస్టెంట్స్ ని చాలా వరకు హౌస్ మేట్స్ ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారు.బాల ఆదిత్యను శ్రీహాన్ ఇమిటేట్ చేసిన తీరు బాగుంది. సీజన్  4లో జబర్దస్త్ అవినాష్ ఇంట్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ ని చాలా ఫన్నీగా ఇమిటేట్ చేసేవాడు. బహుశా ఈ టాస్క్ లో ఫైమా ఉంటే బాగుండేదేమో. ఇక విన్నర్ ప్రైజ్ మనీ రూ. 47 లక్షలకు చేరింది. రేపు వీకెండ్ కాగా నాగార్జున ఎంట్రీ ఇస్తారు. నామినేషన్స్ లో ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్, కీర్తి, ఇనయా, శ్రీసత్య ఉన్నారు. మరి  ఎలిమినేట్ అయ్యేదెవరు? ఫైనల్ కి చేరేదెవరు? అనేది ఆదివారం డిసైడ్ కానుంది. 
 
 

Read more Photos on
click me!

Recommended Stories